Switch to English

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి తెలియదని ఎలా అనుకోగలం.?

తాను అధికారంలో వున్నప్పుడు నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికల్ని చంద్రబాబు వాయిదా వేస్తూ వచ్చారు. లేకపోతే, ఆ స్థానిక ఎన్నికలు టీడీపీకి రాజకీయంగా ఎంతగానో ఉపయోగపడేవి. అధికారంలో ఎవరుంటే, వాళ్ళకే దాదాపుగా స్థానిక ఎన్నికలు అనుకూలమవుతాయి. ఒకవేళ అనుకూలంగా లేకపోయినా, తమకు అనుకూలంగా మార్చేసుకునే వీలు అధికార పార్టీకి కలుగుతుంది. ఆ అద్భుత అవకాశాన్ని చంద్రబాబు వదిలేసుకున్నారు.. టీడీపీని నట్టేట్లో ముంచేశారు.

అంతకు మించి.. అనే స్థాయిలో అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్ని నిర్వహించింది. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, స్థానిక ఎన్నికల్లో పై చేయి సాధించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని మాత్రమే బహిష్కరించి.. టీడీపీ అధినేత చంద్రబాబు చారిత్రక తప్పిదం చేసేశారు. ఇక, టీడీపీ కోలుకోవడం దాదాపుగా అసాధ్యం. పార్టీ శ్రేణులకు సమాధానం చెప్పుకోలేని స్థితికి చంద్రబాబు దిగజారిపోయారిప్పుడు.

గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినా.. అదో లెక్క. పోటీలో టీడీపీ అభ్యర్థులున్నారు.. వాళ్ళలో చాలామంది ఓడిపోయారు.. కారణం, టీడీపీ.. పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించడమే.! బహిష్కరించకుండా వుంటే, టీడీపీ గెలిచేదా.? అలాగని అనలేంగానీ.. కనీసం పార్టీ శ్రేణుల్లో కాస్తంతైనా హంగామా కనిపించేది. సరిదిద్దుకోలేని తప్పు ఇది. రాజకీయంగా చంద్రబాబు వేసిన ఈ తప్పటడుగు.. టీడీపీని పూర్తిగా పాతాళానికి తొక్కేసింది.

అంతే కాదు, చంద్రబాబు నిర్ణయంతో.. వైసీపీ బలం పదింతలు పెరిగినట్లయ్యింది.. వైసీపీని ఉద్ధరించడమే పనిగా పెట్టుకున్నారా చంద్రబాబు.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు. అయినా, పరిషత్ ఎన్నికలు పద్ధతి ప్రకారం జరిగాయని ఎలా అనగలం.? అసలు వీటిని ఎన్నికలని ఎవరైనా అంటారా.? ఎంపికలు మాత్రమే.. అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ ఎంపికలకి సంబంధించి తొలి ముద్దాయి వైసీపీ అయితే, రెండో ముద్దాయి టీడీపీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్ అలా.. గంజాయి ఇలా.. ఎవరిది ఈ పాపం.?

పొరుగు రాష్ర్టాల నుంచి మధ్యం బాటిళ్లు అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కానీ, తనిఖీల కళ్లు కప్పి పొరుగురాష్ట్రల నుంచి మధ్యం యధేచ్చగా రాష్ట్రంలోకి...

ధోనీ భాయ్ తర్వాత అలాంటి వికెట్‌ కీపర్ దొరకలేదు ః కోహ్లీ

నేటి నుండి ప్రారంభం కాబోతున్న టీ20 మెగా టోర్నీలో టీం ఇండియా విజయాలతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు ఐపీఎల్‌ ఆడి వెంటనే ప్రపంచ కప్ కు సిద్దం అయిన...

భారత్‌ పాక్ మ్యాచ్‌ రోజ నేను కనిపించకుండా పారిపోతా

టీ20 ప్రపంచ కప్‌ సమరం ప్రారంభం అయ్యింది. యూఏఈలో పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు భారత్‌ మరియు పాకిస్తాన్ ల మ్యాచ్...

పెట్రోల్‌ రేట్లకు నిరసనగా బస్సుకు నిప్పు పెట్టిన యువకుడు

దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్లకు నిరసనగా ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన ఏడు కొండలు అనే 21 ఏళ్ల కుర్రాడు బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు....

జార్వో ఈసారి ఫుట్‌ బాల్ మైదానంలో..!

భారత్ ఇండ్లాండ్‌ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో పదే పదే గ్రౌండ్‌ మద్యలోకి ఇండియా జెర్సీలో వచ్చిన ప్రాంక్ యూట్యూబర్ జార్వో గుర్తున్నాడు కదా.. అతడి వల్ల ఆట పలు సార్లు...