తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు ముగించుకుంది. రెండవ వారంలో అంతా ఊహించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే ఉమాదేవి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ అవ్వబోతుంది అంటూ చాలా రోజులుగా అంటున్నారు.. దానికి తోడు శనివారమే ఉమా ఎలిమినేట్ అంటూ లీక్ వచ్చింది. లీక్ అయినట్లుగానే ఉమా ఎలిమినేషన్ అయినట్లుగా నాగార్జున చివర్లో ప్రకటించాడు. అంతకు ముందు వరకు ఇంటి సభ్యులతో సరదాగా సండే ఫన్ డే అన్నట్లుగా నాగార్జున ఎంటర్ టైన్ చేశాడు. మొదట అమ్మాయిలు అబ్బాయిలు వేరు వేరుగా గ్రూప్స్ ఏర్పాటు అయ్యి డాన్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. అమ్మాయి అబ్బాయి కలిసి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలకు ఎక్కువగా మార్కులు వచ్చాయి.. అయినా కూడా ఓవరాల్ గా చూసి అమ్మాయిలు గెలిచినట్లుగా పేర్కొన్నారు.
డాన్స్ లు చాలా సరదాగా చేశారు. కొందరు డాన్స్ లతో కనువింధు చేయగా.. కొందరు డాన్స్ పేరుతో కామెడీ చేసి ఆకట్టుకున్నారు. మొత్తానికి డాన్స్ లు మరియు ఎంటర్ టైన్మెంట్ తో నాగ్ ఫన్ క్రియేట్ చేసి అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. ఆకట్టుకునే స్కిట్స్ మరియు అన్ని విధాలుగా మెప్పించిన ఎలిమెంట్స్ తో ఆదివారం ఎపిసోడ్ సాగింది. డాన్స్ తర్వాత ఇంట్లో దెయ్యం ఎవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నంను నాగ్ చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువ శాతం మంది సిరికి ఓటు వేశారు. దాంతో సిరి ఇంట్లో క్యూట్ దెయ్యంగా నిలిచింది. షణ్ముఖ్ తనకు తానుగా దెయ్యంగా చేసుకునేందుకు ప్రయత్నించగా అందుకు నాగార్జున నిరాకరించడంతో సిరిని దెయ్యంగా షణ్ణు ఎంపిక చేయడం జరిగింది.
ఎలిమినేట్ అయిన ఉమా కొందరికి బాధ కలిగించి వెళ్లి పోయింది. కొందరిపై కోపం చూపించి వెళ్లి పోయింది. మొత్తంగా సిరి మరియు షణ్ముఖ్ లను ఉమా టార్గెట్ చేసింది. ఇద్దరు కూడబలుక్కుని ఆట ఆడుతున్నారు అంటూ ఆరోపించింది. లోబోను అంతా ఒక రకంగా చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. లోబో మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఉమా వెళ్లి పోతూ కొందరి ఆట విషయంలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యింది. మొత్తంగా బిగ్ బాస్ లో ఉమా వెళ్లి పోవడంతో కొందరు హ్యాపీ.. కొందరు సాడ్ అన్నట్లుగా ఉంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో రచ్చ జరుగబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటేనే అనిపిస్తుంది.
306962 203306Id always want to be update on new content on this website , saved to fav! . 189226
526298 310868Superb post but I was wanting to know in case you could write a litte a lot more on this topic? Id be quite thankful if you could elaborate slightly bit a lot more. Thanks! 620902