Switch to English

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ వేదనతో సమానమే. సినిమా అంటే కేలం హీరోలు, హీరోయిన్లు కాదు. నిర్మాత, దర్శకుడు, బోల్డంతమంది కార్మికులు.. ఇలా పెద్ద తతంగమే వుంటుంది.

సినిమా నిర్మాణానికి ముందు.. నిర్మాణ సమయం.. నిర్మాణం పూర్తయ్యాక విడుదల.. ఇలా ప్రతి ఘట్టం.. దేనికదే అత్యంత కష్టమైనది. సినీ పరిశ్రమ ద్వారా ప్రభుత్వాలకు పెద్దయెత్తున పన్నులు అందుతాయి. అయినా, సినీ పరిశ్రమని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.. ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అంటూ పరిశ్రమ పెద్దలు, రెండు చేతులూ జోడించి ప్రభుత్వాల్ని వేడుకునే పరిస్థితి ఎందుకొచ్చింది.?

సినిమా రంగంలో సక్సెస్ రేటు చాలా చాలా తక్కువ. ఫ్లాప్ సినిమాని కూడా హిట్టు సినిమా.. అని చెప్పుకోక తప్పదు. తద్వారా తదుపరి సినిమాకి మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచన దర్శకుడు, నిర్మాత, నటీనటులు.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారు. అదే ఘోర తప్పిదంగా తయారైంది. చాలా తక్కువ సక్సెస్ రేట్ తెలుగు సినీ పరిశ్రమలో వున్నా.. మొత్తంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే.. ఆ విషయంలో తెలుగు సినిమానే బెటర్.

నటీనటుల్లో కొందరి రెమ్యునరేషన్ 50 కోట్లు టచ్ చేస్తున్న మాట వాస్తవం. అలాగని అందరూ అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారనంటే ఎలా.? 50 కోట్లు తీసుకునే హీరో, పరిస్థితిని బట్టి.. అందులో సగం వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. మొత్తంగా తన రెమ్యునరేషన్ అంతా వదులుకోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో చాలానే చూశాం. ఇవన్నీ ‘ఎగతాళి’ చేసేవారికి కనిపించవుగాక కనిపించవు.

మద్యం రేట్లు పెరుగుతాయ్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయ్, కరెంటు ఛార్జీలు పెరుగుతాయ్.. సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం పెరగవ్. ఇదెక్కడి వైపరీత్యం.? సినిమా టిక్కెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో వుండాల్సిందే.. బ్లాక్ మార్కెటింగ్‌కి అడ్డుకట్టపడాల్సిందే. కానీ, ఆ పేరు చెప్పి, పరిశ్రమ గొంతు నొక్కేస్తే ఎలా.? అయినా, ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అని చిరంజీవి ఒక్కరే బతిమాలుకుంటే ఎలా.?

పరిశ్రమలో ఇంకెవరూ గొంతు విప్పరా.? పరిశ్రమ బాగు కోసం, బాధ్యతను భుజానికెత్తుకున్న చిరంజీవిని ట్రోల్ చేసే వారెవరైనా.. రాజకీయం ఎలా ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తోందో తొలుత ఆలోచించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఎక్కువ చదివినవి

అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక తొలి సంతకం…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు వర్ధన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. పాత ప్రెసిడెంట్ నరేష్ బాధ్యతలను విష్ణుకు అప్పగించారు. ఈసారి ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు...

పిల్లలకు టీకా మంచిదే

ఇప్పటికే పలు దేశాల్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇండియాలో ఇటీవలే దీనికి అనుమతులు లభించాయి. ఆ విషయం అందరికి కాస్త ఊరటనిస్తుంది. ఇండియాలో ఇవ్వబోతున్న కరోనా వ్యాక్సిన్ గురించిన మరింత...

రాశి ఫలాలు: శనివారం 16 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా.5:37 తిథి: ఆశ్వీయుజ ఏకాదశి రా.7:07 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: థనిష్ట మ.12:01 వరకు తదుపరి శతభిషం యోగం: గండ...

నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా

మా ఎన్నికల్లో ఈసీ మెంబర్‌ గా పోటీ చేసిన జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ అనూహ్యంగా ఓటమి పాలవ్వడం ఆమె అభిమానులకు చాలా ఆందోళన కలిగించింది. అయితే ఆమె ఓటమి అనూహ్య పరిణామాల మద్య...

చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. అసలేం జరిగింది?

మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో చాలా ప్రభావవంతంగా పని చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చాలా కష్టపడి ఆక్సీజన్ సిలిండర్లను అందించి కొన్ని వందల మంది...