తమిళ్ స్టార్ హీరో అజిత్ గత కొన్నాళ్లుగా ‘విడా ముయార్చి’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని, రిస్కీ షాట్స్ ను అజిత్ చేస్తున్నాడు అంటూ ఇటీవలే తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇంతలోనే అజిత్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అంటూ వార్తలు రావడం అభిమానులకు ఆందోళన కలిగించింది. సోషల్ మీడియా ద్వారా అజిత్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హడావుడి చేశారు. ఆసుపత్రి కి అజిత్ వెళ్లడానికి కారణం ఏంటి అంటూ మీడియా సర్కిల్స్ లో కూడా ఆసక్తి నెలకొంది.
అజిత్ సన్నిహితులు ఆందోళనకు తెర దించారు. జనరల్ చెకప్ కోసమే చెన్నై అపోలో ఆసుపత్రిలో అజిత్ జాయిన్ అయ్యారని, అంతకు మించి ఏమీ లేదని, ఆయనకు చిన్న గాయం కాలేదు. ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా వారి నుంచి క్లారిటీ వచ్చింది.