సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షూటింగ్ప్ ప్రారంభించే అంశంలో ఇండస్ట్రీలో ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారితోనే చర్చలు జరిపామన్నారు. అందరినీ పిలవ లేదు.. ఇది నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన విషయం.. అందరినీ పిలిచి మట్లాడాలంటే అందుకు తనకేమీ అభ్యంతరం లేదన్నారు. బాలయ్య విషయంలో అసలేం జరిగిందో తెలుసుకుంటా అన్నారు.
సినిమా షూటింగ్స్ విషయమై మాట్లాడుతూ.. ‘త్వరలోనే షూటింగ్స్ కు అవసరమైన అనుమతులు ఇస్తాం. ఈ పరిస్థితుల్లో ఎలా షూటింగ్ చేయాలి.. ఎంతమంది ఉండాలి.. ఎంత సేపు ఉండాలి అనే అంశాలపై చర్చించి విధి విధానాలు రూపొందించాం. 24 విభాగాల అంశాలపై మాట్లాడాను. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లాక అనుమతి ఇచ్చే అంశాన్ని తెలియజేస్తాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. ధియేటర్లు తెరిచే అంశంపై ఇంకా చర్చించాల్సి ఉంది’ అని సమావేశ వివరాలు తెలియజేశారు.
నాగార్జున మాట్లాడుతూ ‘ ఇక్కడ విషయం ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ మేము మా సురక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి, షూటింగ్స్ మొదలు పెట్టాలనేది ఫిక్స్ కావాల్సి ఉంది. కాబట్టి ఇది అంతా మా చేతుల్లోనే ఉంది. ఈ విషయాలకు సంబంధించే మంత్రి గారు పరిశ్రమలోని వారందరితో చర్చిస్తున్నారని’ అన్నారు.
నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ప్రభావం అందరినీ ఇబ్బంది పెడుతోంది. పనిలో భాగంగా నటీనటులు, టెక్నీషియన్లు ఒకరినొకరు టచ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే అన్ని జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలవుతాయి. షూటింగ్స్ మొదలైన కొన్ని నేనాలకి థియేటర్స్ పై క్లారిటీ వస్తుంది. మేమైతే దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరవాలని కోరాం’ అన్నారు.
తలసాని గారి కృషి అభినందనీయం: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-` ‘మిత్రులు, శ్రేయోభిలాషులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు తలసాని సేవా ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ-టీవీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. సినీరంగంలోని వారికే కాకుండా టీవీ రంగంలోని వారికి కూడా సాయం చేయడం మంచి విషయం. సినీపరిశ్రమ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమీప బంధువులు చనిపోవడం వల్ల నేను హాజరు కావాల్సి ఉన్నా రాలేకపోయాను. పరిశ్రమకు ప్రభుత్వానికి సంధాన కర్తలుగా కావాల్సిన సాయం అందించడం సంతోషాన్ని కలిగిస్తోంది. గత నెలలో సీసీసీ ద్వారా నిత్యావసరాల సాయం అందించాం. కష్టకాలంలోనూ అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు` అని అన్నారు.
సురేశ్ బాబు, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ కూడా తలసానికి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
648373 881297Hi this is somewhat of off subject but I was wondering if blogs use WYSIWYG editors or in the event you need to manually code with HTML. Im starting a blog soon but have no coding information so I wanted to get guidance from someone with experience. Any help would be greatly appreciated! 222515
720843 356672There a few interesting points over time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I appear into it further. Really good post , thanks and now we want more! Included with FeedBurner at exactly the same time 241256