‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమా ఇది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘సైరా నరసిహారెడ్డి’ తెరకెక్కిన విషయం విదితమే. అయితే, చరిత్ర ఏంటి.? సినిమాలో ఏముంటుంది.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఆ చర్చ ఇప్పుడు మరింత విస్తృతమవుతోంది. సైరా నరసింహారెడ్డి ఎవరు.? స్వాతంత్రోద్యమ పోరాటంలో నరసింహారెడ్డి పాత్ర ఏంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉ
య్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఈ ‘సైరా నరసింహారెడ్డి’. ‘సైరా నరసింహారెడ్డి.. సై సైరా..’ అంటూ తెల్ల దొరలపై తిరగబడిన భారతీయుల చరిత్ర ఇది. కానీ, ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కొందరు ‘దొంగ’గా అభివర్ణిస్తున్నారు. గతంలో ఈ విషయమై ఓ ఛానల్‌లో పెద్ద ‘రచ్చ’ కూడా జరిగింది. చరిత్ర జరిగినవి జరిగినట్లు రాసిన దాఖలాలు కన్పించవు. బ్రిటిష్ హయాంలో చరిత్ర వక్రీకరణ జరిగింది. అలా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ‘దోపిడీ దొంగ’గా అభివర్ణించారు. ఆ నేరం కారణంగానే ఉరితీసి, అతని పార్తీవ దేహాన్ని 30 ఏళ్ళపాటు కోటగుమ్మానికి వేలాడదీశారు బ్రిటిష్ పాలకులు.
Also Read: చిరు ‘సైరా’ ట్రైలర్ రివ్యూ : పక్కా ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ .!
చరిత్రలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కన్పిస్తారు.. అందులో అమరులైన మహనీయులందరి మీదా ‘దొంగలు’ అనో, ‘దోపిడీదారులు’ అనో, ‘తిరుగుబాటుదారులు’ అనో బ్రిటిష్ పాలకులు ముద్ర వేసిన మాట వాస్తవం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయంలోనూ అదే జరిగింది. బ్రిటిష్‌వారు వేసిన ముద్ర సంగతి పక్కన పెడితే, చరిత్ర చదువుకుంటున్న మనలో కూడా.. చాలామంది చరిత్రను వక్రీకరించేలా వ్యవహరిస్తుండడం బాధాకరం. మన తెలుగు వీరుడ్ని మనం ఏనాడూ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తుంచుకోలేదు.
‘రేనాటి సూరీడు..’గా పేరొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, కర్నూలులోని ఉయ్యాలవాడ ప్రాంత వాసులు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. ఆ చరిత్ర ఇప్పటిదాకా అణగదొక్కబడింది. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మళ్ళీ ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధీరత్వం ప్రపంచానికి తెలుస్తోంది. దీన్నొక సినిమాగా కంటే, ఓ వీరుడి చరిత్రగా భావిస్తే, భావితరాలకు మనం మన వీరుడి ధీరత్వాన్ని తెలియజేసేందుకు వీలు కలుగుతుంది. దురదృష్టం.. ‘సైరా నరసింహారెడ్డి’ని సినిమాగా మాత్రమే చూస్తోన్న చాలామంది, చరిత్రను వక్రీకరించి.. వెకిలి చేష్టల్ని చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
