Switch to English

కోడెల శివప్రసాద్‌ తర్వాత లిస్ట్‌లో వున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో శతృవుని ఎదుర్కొనే క్రమంలో మానసికంగా అత్యంత దృఢత్వంతో వ్యవహరించాలి. నిజానికి అలా మానసిక బలం కలిగినవాడికే రాజకీయాల్లో స్థానం వుంటుంది. అయినాగానీ, అంతిమంగా ఓ మనిషి ఏ క్షణాన మానసిక బలహీనతతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అంచనా వేయలేం. అలా అంచనా వేయగలిగితే, ఆత్మహత్యలనేవే భూమ్మీద వుండవు. అసలు విషయానికొస్తే, కోడెల శివప్రసాద్‌ స్వతహాగా ఓ డాక్టర్‌. ఆయన ఆత్మహత్య చేసుకోవడమేంటి.? ఈ ప్రశ్నకు ఇంకాస్త లోతుగా సమాధానం వెతికితే, తూర్పుగోదావరి జిల్లాలో ఓ డాక్టర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తుకొస్తుంది.

డాక్టర్‌ అయినంతమాత్రాన మానసికంగా బలహీనపడకూడదన్న రూల్‌ ఏమీ లేదు. కోడెల శివప్రసాద్‌ లాంటోళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలామంది వున్నారు. ఆ మాటకొస్తే, వివిధ రాజకీయ పార్టీల్లో చాలామంది కన్పిస్తారు. ‘ఓడినోడు కౌంటింగ్‌ సెంటర్‌ దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు, ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు..’ అని ఈ మధ్య చాలామంది పొలిటికల్‌ లీడర్స్‌ చెబుతుండడం చూస్తున్నాం. ఆ లెక్కన, రాజకీయాల్లో గెలుపోటములు వుండవన్నమాట. కానీ, రాజకీయ వేధింపుల కారణంగా కోడెల మృతి చెందడం బాధాకరం.

Also Read: కోడెల బలవన్మరణం: జగన్‌ సర్కార్‌పై ఢిల్లీ పెద్దల గుస్సా.!

ఈ వేధింపులు చాలామంది రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్నా, కోడెలది మరీ ఇంత పరిస్థితి. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీదా రాకూడని ఆరోపణలు వచ్చాయి. మానసికంగా హింసించే క్రమంలోనే కోడెలపై ‘అసెంబ్లీ ఫర్నిచర్‌’ ఆరోపణ తెరపైకొచ్చిందన్నది నిర్వివాదాంశం. ఇదిలా వుంటే, కోడెలతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీ టార్గెట్‌లో వున్నారు. వారిలో నలుగురైదుగురి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. ‘టీడీపీ ఖాళీ అయిపోవాలి.. వస్తే, వైసీపీలోకి వచ్చెయ్యాలి.. లేదంటే, బీజేపీలోకి వెళ్ళిపోవాలి.. టీడీపీలో మాత్రం ఎవరూ వుండకూడదు’ అన్నది వైసీపీ నినాదం.

గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కుంది గనుక, వైసీపీ.. టీడీపీకి ఇప్పుడు వేస్తున్న శిక్ష అది. తోట త్రిమూర్తులు టీడీపీని వీడి, వైసీపీలో ఎందుకు చేరారు.? ఈ ప్రశ్నకు సమాధానంగా కోడెల వ్యవహారాన్నే కొందరు ప్రస్తావిస్తున్నారు. ‘వైసీపీలోకి తోట త్రిమూర్తులు వచ్చినా, ఆయనే నాకు రాజకీయ ప్రత్యర్థి’ అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యవహారం చూస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరిన్ని ఆత్మహత్యల్ని చూడబోతున్నామన్నమాట.

అదే నిజమైతే, అంతకన్నా దారుణం ఇంకోటుండదు. ఇంతకీ, కోడెల తర్వాతి వికెట్‌ ఎవరిది.? ఆత్మహత్య అన్న యాంగిల్‌లో కాదుగానీ, ఆ స్థాయిలో వేధింపులు ఎదుర్కోనున్న ఓ ప్రముఖుడి పేరు అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదిఏమైనా, కోడెలకి పట్టిన దుర్గతి మాత్రం ఇంకెవరికీ పట్టకూడదు.

3 COMMENTS

  1. 489650 293506The subsequent time I read a weblog, I hope that it doesnt disappoint me as a great deal as this 1. I mean, I know it was my option to read, but I truly thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something which you possibly can repair ought to you werent too busy on the lookout for attention. 693824

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....