నిఖిల్ నుండి రీసెంట్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. డీసెంట్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ను దాటి ఇంకా ప్రభంజనం కొనసాగిస్తోంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.
అయితే కార్తికేయ 2 కంటే ముందే నిఖిల్ మొదలుపెట్టిన చిత్రం 18 పేజిస్. ఈ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిత్రం విడుదలవ్వాలి కానీ ఏడు నెలలైనా ఇంకా ఈ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. వివరాల్లోకి వెళితే ఈ సినిమా తెరకెక్కిన విధానంపై సుకుమార్ సంతృప్తిగా లేడట. అందుకే హోల్డ్ లో పెట్టారట.
మరిప్పుడు కార్తికేయ 2 విజయం తర్వాత ఈ సినిమా ఏమైనా ముందుకు కదులుతుందేమో చూడాలి.
Wow, attractive website. Thnx … [url=http://www.enmakerspace.co.kr/theme/lcmsres/bbs/board.php?bo_table=notice&wr_id=619644]prix du omeria sur ordonnance[/url]
159177 431179I entirely agree with you about this matter. Good post. Already bookmarked for future reference. 407105