శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెల్సిందే. అయినా కూడా ఆకలితో అలమటిస్తున్న జనాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తూ లూటీలకు పాల్పడుతూ హింసకు దిగుతున్నారు. ఆర్మీ మరియు పోలీసులపై విచక్షణ రహిత్యంగా దాడులు చేస్తూ ఉన్నారట. దాంతో ప్రభుత్వం అక్కడ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాను కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు సిద్దం అయ్యింది. ఇక నుండి రోడ్ల మీద ఆందోళన కారులు కనిపిస్తే కాల్చి చంపేసేందుకు ఆర్మీ మరియు పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ కర్ఫ్యూ మరియు ఎమర్జెన్సీ వాతావరణం కంటిన్యూ అవ్వబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లక్షల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఏం చేయాలో పాలు పోక దేశ వ్యాప్తంగా ప్రజలను రోడ్ల పైకి రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శ్రీలంకలో పరిస్థితి ఇప్పట్లో కుదుట పడే అవకాశాలు కనిపించడం లేదని అంతర్జాతీయ స్థాయి మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.