ఏపీ పదవ తరగతి పరీక్ష నిర్వహణ సమయంలో లీకేజ్ కు పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి.. తెలుగు దేశం పార్టీ కీలక నాయకుడు నారాయణ అరెస్ట్ అయ్యిన విషయం తెల్సిందే. ఆయన తరపు న్యాయవాదులు నారాయణ స్కూల్క్ మరియు కాలేజీలకు మాజీ మంత్రి నారాయణకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించారు. దాదాపు పదేళ్లు గా ఆయన పూర్తిగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయన విద్యా సంస్థలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతల్లో లేరు.
కనుక ఆయన్ను ఈ కేసులో కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ లాయర్ లు వాదించారు. నారాయణ సంస్థలతో ఎలాంటి సంబంధం నారాయణకు లేదని నిరూపితం అయిన కారణంగా న్యాయ స్థానం ఆయనకు వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల జామీను చెల్లించి నారాయణ బెయిల్ ను పొందారు. ఆ తర్వాత నారాయణ స్పందించారు. తాను నారాయణ విద్యా సంస్థల విదుల నుండి చాలా సంవత్సరాల క్రితమే తప్పుకున్నాను. తప్పుడు ఉద్దేశ్యంతో తనపై కేసు పెట్టారని ఆరోపించారు.