గత కొంత కాలంగా శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే. ఆ విమర్శల తీవ్రత చాలా జుగుప్సాకరంగా కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ మీదనే కాదు, హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ముల, సినీ రచయిత కోన వెంకట్, మరో దర్శకుడు కొరటాల శివ, నిర్మాత సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్పైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌లో చాలామందే వుంటారు శ్రీరెడ్డి బాధితులు.
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులంటూ రోడ్డెక్కి అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి, ఆ తర్వాత అలా వచ్చిన పబ్లిసిటీతో బాగానే పండగ చేసుకుంది. అది చాలక, సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా, హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ స్టేట్మెంట్ని జనరలైజ్ చేసి ఇస్తే, దానిపై మీడియాలో పెద్ద దుమారం రేగింది. అది పవన్ కళ్యాణ్ మీదనేనంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలొచ్చాయి.
అయితే, తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారంటూ పూనమ్ కౌర్ ఇంకో ట్వీట్లో ప్రస్తావించింది. తాను చేసిన వ్యాఖ్యల్లో విస్తృత అర్థాన్ని గ్రహించలేక ఓ బౌండరీలో ఇరుక్కుపోయారంటూ మండిపడింది పూనమ్ కౌర్. ఈ విషయంలోకి శ్రీరెడ్డి ఎంటర్ అయిపోయింది. ‘గోడ మీద పిల్లి..’ అంటూ విరుచుకుపడింది. ‘ఒక్క ఫిర్యాదు చేస్తే, అంతు తేల్చేస్తారు..’ అని ఉచిత సలహా కూడా ఇచ్చేసింది.
అయితే, ‘శ్రీరెడ్డీ నువ్వేం పీకినవ్?’ అని ఆమెపై విమర్శనాస్త్రాలు దూసుకెళుతున్నాయి. చాలామందిపై ఆమె ఆరోపణలు చేసింది.. ఒక్క ఆరోపణనీ నిజమని నిరూపించలేకపోయింది. పబ్లిసిటీ కోసం ఏ అవకాశాన్నీ వదులుకోని ఆమె తీరు ప్రతిసారీ నవ్వులపాలైపోతోంది. ‘నవ్విపోదురుగాక నాకేటి.?’ అన్నట్టుంది శ్రీరెడ్డి తీరు.
557029 883855I like the valuable information you offer inside your articles. Ill bookmark your weblog and check again here regularly. Im quite certain Ill learn plenty of new stuff right here! Very best of luck for the next! 463412
201107 152143Aw, this became an really nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a quite great article but exactly what do I say I procrastinate alot and by no means locate a strategy to get something completed. 934222