సాక్షాత్తూ ఓ మీడియా సంస్థకు అధిపతి అయి వుండీ, మీడియాపై ఉక్కుపాదం మోపాలనుకోవడాన్ని ఏమనుకోవాలి.? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, చాన్నాళ్ళ క్రితం సాక్షి మీడియాని స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్‌కి మద్దతుగా పనిచేసిన ఆ ఛానల్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత అదే కాంగ్రెస్ పార్టీపై బురదజల్లుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీపై సాక్షి అత్యుత్సాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనపై సాక్షి మీడియా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు పాలనపై సాక్షి విమర్శనాత్మ కథనాలకైతే కొదవే లేదు. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ‘నిరాధార కథనాలపై’ చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆయా శాఖాధిపతులకు అధికారం కట్టబెట్టింది వైఎస్ జగన్ సర్కార్.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మీడియా తీరు గడచిన రెండు దశాబ్దాల్లో చాలా మారిపోయింది. ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా మీడియా సంస్థలు వ్యవహరించాల్సి దుస్థితిని.. ఆయా రాజకీయ పార్టీలే కల్పించాయి. మీడియా సంస్థల్లో రాజకీయ నాయకుల పెట్టుబడులూ ఇందుకు కారణమే. ఇక, నచ్చని కథనాలపై కేసులు పెట్టుకుంటూ పోతే, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా సమీప భవిష్యత్తులో అంతర్థానమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పటికే పత్రికలు కరపత్రికలుగా మారిపోయాయి. అది జగన్ మీడియా రంగంలోకి రావడంతోనే మొదలయ్యిందంటారు చాలామంది. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు, మరింత బాధ్యతగా పాలన అందించాల్సిన ప్రభుత్వం, ఆ మీడియా కథనాల్ని సహించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
మీడియాలో వచ్చే కథనాలపై కేసులు వేస్తారు సరే, మీడియా సాక్షిగా మంత్రులు రాజకీయ ప్రత్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తే, వారిపైనా కేసులు పెడ్తారా.? అఫ్కోర్స్ విపక్షాలపై కేసులు పెట్టాలని ప్రభుత్వంలో వున్నవారికి ప్రత్యేకంగా సూచించక్కర్లేదు.. కక్ష సాధింపు చర్యల్లో అది ఎప్పుడో ఓ భాగమైపోయింది. ‘మీడియా సంస్థ అధిపతి, అధికార పీఠమెక్కాక.. ఆ మీడియాపైనే ఉక్కుపాదం మోపుతున్నారు..’ అంటూ జనం ముక్కన వేలేసుకుంటున్న వైనంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమంటారో.!
100904 824273I was reading some of your content material on this web site and I believe this internet internet site is really informative! Keep putting up. 547373
759081 132631Hello. Great job. I did not anticipate this. This is a impressive story. Thanks! You created certain fine points there. I did a search on the subject matter and identified the majority of folks will have the same opinion along with your blog. 184390
698893 410950Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a very good article but I procrastinate too much and never appear to get started. Thanks though. 559385
62500 824031I definitely enjoyed the method which you explore your experience and perception of the area of interest 693648
46130 138151I gotta bookmark this website it seems quite useful . 282344
999375 86273However, what in regards to the bottom line? Are you sure in regards to the supply? 102710