– మీ ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరో మీరు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటినుండి ఉంది?
చిన్నప్పటి నుండి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకూ ఈ విషయం తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి నుండి యాక్టింగ్ ఇంట్రెస్ట్. అయితే, ఏదో ఒక పని చేయాలని డిగ్రీ తర్వాత ‘రంగస్థలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశా. ఆ సినిమా మొదలు కావడానికి ముందు… మూడేళ్ళ క్రితం రితేష్ రానా ‘మత్తు వదలరా’ కథతో వచ్చాడు. అయితే కథలో కరెక్షన్స్ చేసుకు వస్తానని చెప్పాడు. ‘రంగస్థలం’ పూర్తయ్యాక మూడు నెలలు యాక్టింగ్ లో ట్రయినింగ్ తీసుకుని ‘మత్తు వదలరా’ చేశాం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలి. వాళ్లకు పెద్ద ప్రాజెక్ట్స్ ఉండడంతో మా చెర్రీ మామ బ్యానర్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ లో చేశాం. ‘రంగస్థలం’కి పని చేసేటప్పుడు నాపై మైత్రీ వాళ్లకు నమ్మకం కలిగింది. సినిమా చేసే ముందు డెమో వీడియో షూట్ చేసి చూపించాం. దాంతో సినిమాకు ప్రజెంట్ చేశారు.
– చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏయే సినిమాలు చేశారు?
‘యమ దొంగ’లో ఎన్టీఆర్ చైల్డ్ క్యారెక్టర్ నేనే చేశా. ‘మర్యాద రామన్న’లో కూడా ఒక క్యారెక్టర్ చేశా.
– యాక్టర్ అవుతానని అన్నప్పుడు, యాక్టింగ్ లో ట్రైనింగ్ క్లాసులకు వెళుతున్నప్పుడు రాజమౌళి, కీరవాణి ఇచ్చిన సలహాలు ఏంటి?
యాక్టింగ్ పరంగా ఇవ్వలేదు. కానీ, వాళ్ళ ప్రభావం నాపై ఉంటుంది. వాళ్ళు పనిచేసే విధానం చూసి నేర్చుకున్నది ఎక్కువ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందనేది చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇండస్ట్రీ గురించి కొన్ని సలహాలు ఇచ్చారు.
– హీరోగా చేస్తున్నాని రాజమౌళికి చెప్పినప్పుడు ఏమన్నారు?
ఆయన కొంచెం భయపడ్డారు. ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే యాక్టింగ్ అనేసరికి ఎవరికైనా భయం ఉంటుంది. సర్వైవ్ అవుతాడా, లేదా అని. అలాగని, ఎప్పుడూ నన్ను ఆపలేదు. రాజమౌళిగారితో పాటు ఇంట్లో అందరు సపోర్ట్ చేశారు. కష్టపడమని, చేసుకోమని చెప్పారు.
– రాజమౌళి కుమారుడు, మీ అన్నయ్య కార్తికేయ ఏమన్నారు?
మా పేరెంట్స్ కి భయాలు ఉన్నా… అన్నయ్య కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫ్యూచర్ లో తన బ్యానర్ లో నేను, కాలభైరవ అన్నయ్య కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
– మీ నేపథ్యానికి పెద్ద కమర్షియల్ సినిమా చేయవచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయడానికి రీజన్ ఏంటి?
సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండక్కర్లేదు. లవ్వు, ఫైట్లు, సాంగులు ఉన్న సినిమాతో లాంచ్ అయితే పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం లేదు. నా నమ్మకం ఏంటంటే… స్టోరీ బావుండాలి. స్టోరీ బావుంటే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ప్రేక్షకులు ఈమధ్య డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు.
– ‘మత్తు వదలరా’ అంటున్నారు. మత్తు అంటే ఏంటి?
సినిమాలో రకరకాలుగా ఉంటుంది. హీరోకి నిద్రమత్తు. పల్లెటూరు నుండి వచ్చి సిటీలో డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ చాలీచాలని జీతంతో జీవితాన్ని వెళ్లదీసే క్యారెక్టర్. ఒక సమస్యలో ఇరుక్కుని ఎలా బయటకు వస్తాడనేది కథ. కథలో 70శాతం ఒక్క రోజులో జరుగుతుంది. మొత్తం కథ రెండుమూడు రోజుల్లో జరుగుతుంది. థ్రిల్లర్ కాబట్టి ఎక్కడికి అక్కడ ఒక్కో సస్పెన్స్ పాయింట్ రివీల్ అవుతుంది.
– మీ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి రీరికార్డింగ్ విషయంలో ఎలా కావాలో చెప్పారా? సలహాలు ఇచ్చారా?
మా టీమ్ లో లాస్ట్ ఎంటర్ అయింది భైరవ అన్న. తనతో కలిసి పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. సినిమాలో పాటలు లేవు. ప్రొఫెషనల్ గా తనతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాలు పెద్దగా రాలేదు. అన్న రీ రికార్డింగ్ స్టార్ట్ చూసేటప్పటికి నేను డబ్బింగ్ స్టార్ట్ చేశా. తమ్ముడిగా నా అభిప్రాయం చెప్పాను తప్ప హీరోగా ఏమీ చెప్పలేదు.
– ఇద్దరు ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ కావడం ఎలా ఉంది?
నేను యాక్టర్ కావాలనేది నా కల. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది భైరవ అన్న కల. ఇద్దరూ ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు. అలా ఆలోచించలేదు. ఇద్దరం కలిసి చేయడం కుదిరినందుకు చాలా హ్యాపీ. ఇంట్లోవాళ్ళు కూడా హ్యాపీ.
– నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
కొన్ని కథలు విన్నాను. కానీ, ఏది కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి ఏం చేయాలో డిసైడ్ అవుతా.
341295 88130This internet page is truly a walk-through its the internet you desired with this and didnt know who require to. Glimpse here, and youll surely discover it. 593488
512513 324324I took a break to view your post. I discovered it very relaxing 21500
396958 21259Wohh exactly what I was searching for, regards for putting up. 135782
193282 637441 Its hard to uncover knowledgeable men and women on this subject, but you sound like you know what youre talking about! Thanks 719353
464424 807496Wow What wonderful details. Thank you for the time you spent on this post. 534935
374207 872472Hey! Great post! Please do tell us when we can see a follow up! 536606
366143 746292Wohh exactly what I was seeking for, regards for posting . 339584
356347 879724This internet site is my aspiration , quite amazing pattern and perfect articles . 154268
511211 641959Will you care and attention essentially write-up most with the following in my webpage in essence your web site mention of this weblog? 575078