Switch to English

విశాఖలో చిరంజీవి భూములు కొన్నారా.? కొనబోతున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు అయితే సాధించారుగానీ, రెండు చోట్ల పోటీ చేసి, ఓ చోట ఓడిపోయారు. 18 మంది ఎమ్మెల్యేలు మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. అది గతం.

ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి పదవి చేపట్టి.. రాజ్యసభ సభ్యత్వం ముగిశాక ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయిన చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానులపై చేస్తున్న ప్రకటనలతో వార్తల్లోకెక్కారు.

విశాఖలో చిరంజీవి భూములు కొనుగోలు చేశారనీ, ఫిలింసిటీ కట్టబోతున్నారనీ, ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పంచన చేరారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. నిజానికి, విశాఖలో చిరంజీవి ఫిలింసిటీ కట్టబోతున్నారన్న ప్రచారం ఈనాటిది కాదు.

చాలాకాలం క్రితం ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు విశాఖలో భూములు కొనుగోలు చేశారు.. స్టూడియో నిర్మించే పనులూ చేపట్టారు. అప్పుడే విశాఖలో చిరంజీవి కూడా భూములు కొనుగోలు చేసి, ఫిలింసిటీ నిర్మాణం చేపట్టాలనుకున్నారట. కానీ, ఆ తర్వాత ఆ ఆలోచన అలా అలా వెనక్కి వెళ్ళిపోయిందంటారు సినీ పరిశ్రమలో చాలామంది. ఆనాటి ఆ విషయాల్ని, ఇప్పుడు రాజధానుల ఎపిసోడ్‌లో లింక్‌ చేసి, మెగాస్టార్‌ చిరంజీవిని వివాదాల్లోకి లాగుతున్నారు కొందరు ఔత్సాహికులు.

అయితే, ఈ ప్రచారాన్ని ఉత్తుత్తి ప్రచారంగానూ కొట్టి పారేయలేని పరిస్థితి. ఎందుకంటే, చిరంజీవి చుట్టూ ఇంత పెద్దయెత్తున రచ్చ జరుగుతున్నా.. ఆయన మీడియా ముందుకొచ్చి ఎలాంటి ప్రకటనా చేయడంలేదు. మీడియాకి ఆయన ప్రెస్‌నోట్స్‌ పంపారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...