Switch to English

స్పెషల్‌ : హ్యాపీ బర్త్‌డే ఎనర్జిటిక్‌ ఇస్మార్ట్‌ దేవదాస్

ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ వారసుడిగా తెరంగేట్రం చేసిన రామ్‌ మొదటి సినిమా దేవదాస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. అద్బుతమైన ఎనర్జి ఈయన సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమా నుండే డైలాగ్‌ డెవరీ, డాన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని విధాలుగా కూడా రామ్‌ తన ఎనర్జిని చూపిస్తూ వచ్చాడు. అందుకే రామ్‌ ను ఎనర్జిటిక్‌ స్టార్‌ అంటూ అభిమానులు ఆరాధించడం మొదలు పెట్టారు.

మొదటి సినిమానే సిల్వర్‌ జూబ్లీ ఆడటంతో పాటు మాస్‌ ఆడియన్స్‌ మరియు క్లాస్‌ ఆడియన్స్‌కు దగ్గర అయ్యాడు. మొదటి సినిమానే సూపర్బ్‌ క్రేజ్‌ తెచ్చి పెట్టడంతో రామ్‌ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడీ చిత్రం యూత్‌ ఆడియన్స్‌కు రామ్‌ను మరింతగా చేరువ చేసింది. రామ్‌లో కామెడీ యాంగిల్‌ను చూపించడంతో పాటు ఇలాంటి కామెడీ కూడా చేయవచ్చా అన్నట్లుగా ఆ సినిమా ఉంటుంది. దాంతో రామ్‌కు స్టార్‌డం మరింతగా పెరిగింది.

సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేసిన కందిరీగ సినిమా రామ్‌కు మరో ఎనర్జిటిక్‌ సూపర్‌ హిట్‌ను తెచ్చి పెట్టింది. ఆ సినిమా సక్సెస్‌తో రామ్‌ యంగ్‌ స్టార్‌ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం మొదలు పెట్టాడు. కందిరీగ చిత్రంలో రామ్‌ నటన మరియు కామెడీ టైమింగ్‌ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రామ్‌ చేసిన సినిమాలు ఎక్కువ శాతం కందిరీగ మరియు ఢీ సినిమాలను పోలి ఉండటంతో పాటు నటన విషయంలో పెద్దగా కొత్తదనంను చూపించలేక పోయాడు అనే విమర్శలు వచ్చాయి.

రొటీన్‌ సినిమాలు చేయడంతో రామ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది. అప్పుడే నేను శైలజ చిత్రంతో మళ్లీ రామ్‌ పుంజుకున్నాడు. యూత్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయిన నేను శైలజ చిత్రం రామ్‌ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టింది. దాని తర్వాత కొన్ని ఫ్లాప్స్‌ వచ్చినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. రామ్‌ చివరగా ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం రామ్‌ ను కొత్తగా చూపించింది. రామ్‌లోని అన్ని యాంగిల్స్‌ను పూరి ఉపయోగించుకుని తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌ అని చెప్పవచ్చు. రామ్‌ ప్రస్తుతం ‘రెడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విపత్తు లేకుండా ఉంటే ఇప్పటి వరకు రెడ్‌ చిత్రం విడుదల అయ్యి ఉండేది. ఆ తర్వాత సినిమాను కూడా రామ్‌ షురూ చేసేవాడు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ బ్రాండ్‌ ను కాపాడుకుంటూ తన ప్రతి సినిమాలో కూడా ఎనర్జిటిక్‌ పెర్ఫార్మెన్స్‌ను కనబర్చుతూ వస్తున్న రామ్‌కు తెలుగు బులిటెన్‌ టీం తరపున మరియు ఆయన అభిమానుల తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

భవిష్యత్తులో రామ్‌ మరిన్ని మంచి సినిమాలను చేసి ఆయన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించాలంటూ ఆశిస్తున్నాం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో జల అద్భుతం.. ఆంధ్రప్రదేశ్‌కి వుందా ఆ అదృష్టం?

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెరపైకొచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అతిపెద్ద ప్రాజెక్టుని కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి....

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...

బిగ్ వార్: బాలయ్య వ్యాఖ్యలపై సి.కళ్యాణ్ పేస్ వేల్యూ లేదంటూ కౌంటర్ అటాక్.!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రభుఖులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరిపారు....

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...