Switch to English

సరి – బేసితో సడలింపులు స్టార్ట్ చేస్తారా?

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేసే దిశగా పలు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మూడో దశ లాక్ డౌన్ లో ఉన్న భారతదేశం.. దానిని మరో విడత పొడిగించడానికే నిర్ణయించింది. అయితే, ఇప్పటికే కొన్ని వెసులుబాట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నాలుగో దశ లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత షాపింగ్ మాల్స్ కు కూడా సడలింపులు ఇవ్వాలని, సరి-బేసి విధానంలో ఆయా షాపులు తెరిచేందుకు అనుమతించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదో మంచి మార్గమని పేర్కొన్నారు. అసలు సరి-బేసి పద్ధతి మొదలైంది హస్తినలోనే. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ను నిరోధించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. ఇది మంచి ఫలితాలే ఇచ్చింది. ప్రతి వాహనం నెంబర్ లో చివరి అంకెను బట్టి ఈ విధానం అమలు చేశారు. ఈ చివరి అంకె సరి సంఖ్య అయితే, ఆ వాహనం సరి సంఖ్య ఉన్న తేదీల్లోనే బయటకు రావాలి. అదే బేసి సంఖ్య అయితే, బేసి సంఖ్య తేదీలున్న రోజుల్లో రోడ్డెక్కాలి. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని షాపింగ్ మాల్స్ లోని దుకాణాలకు వర్తించాలని నిర్ణయించారు. ఆయా మాల్స్ లోని దుకాణాలకు నెంబర్లు కేటాయించి సరి-బేసి విధానంలో వాటిని తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని తెలంగాణలో ఇప్పటికే పాటిస్తున్నారు.

ఆరెంజ్ జోన్ ఉన్నమున్సిపాలిటీల్లో షాపులు తెరవడానికి ఈ పద్ధతే అవలంభిస్తున్నారు. దీనివల్ల పక్కపక్క షాపులు ఒకేసారి తెరిచి ఉండవు. ఫలితంగా భౌతికదూరం అమలవుతుంది. ఇక ఈ భౌతికదూరం అనే కాన్సెప్టు కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ రానంత వరకు వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు, భౌతికదూరం అనేవి ప్రతి ఒక్కరూ పాటించక తప్పదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో అన్ని నెలలపాటు లాక్ డౌన్ కొనసాగించే పరిస్థితి లేనందున త్వరలోనే మరిన్ని సడలింపులు ఖాయంగా కనిపిస్తున్నాయి. స్కూళ్లు, పబ్ లు, రెస్టారెంట్లు, సెలూన్లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలు కొత్త నిబంధనలు, ఆంక్షలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ప్రజారవాణా సైతం భౌతికదూరం నిబంధనతో మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మూడో విడత లాక్ డౌన్ ముగిసి, నాలుగో దశ ప్రారంభం కానుంది. ఆలోగా కేంద్రం ఆయా అంశాల్లో స్పష్టత ఇవ్వనుంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...