కోవిడ్ థర్డ్ వేవ్ మొదలయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రాలు మరోసారి సందిగ్ధంలో పడ్డాయ్. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది. రాధే శ్యామ్ కూడా ఇదే రూట్ ను ఎంచుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి స్లాట్స్ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి.
నాగార్జున బంగార్రాజు ఎప్పటినుండో సంక్రాంతి రిలీజ్ పై కన్నేసింది. ఈ చిత్రం రావడం ఖాయం. అయితే ఈ సంక్రాంతికి ఇదొక్కటే పేరున్న చిత్రం కానుంది. మిగతావన్నీ కూడా చిన్న చితకా చిత్రాలు వస్తున్నాయి.
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఖాయం చేసుకుంది. అశోక్ గల్లా హీరో కూడా జనవరి 15న విడుదల తేదీని బుక్ చేసుకుంది. ఇక దిల్ రాజు రౌడీ బాయ్స్ కూడా సంక్రాంతికే రానుంది. లేటెస్ట్ గా ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన 7 డేస్ 6 నైట్స్ కూడా సంక్రాంతికే వస్తున్నట్లు తెలిపింది.
755260 413708I besides believe therefore , perfectly composed post! . 237517
962800 532934Great information a lot of thanks sharing and reaching us your subscriber list. 450518