Switch to English

వైసీపీ వర్సెస్ టీడీపీ: ‘వంగవీటి’ రాజకీయంలో పాపం అందరిదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వంగవీటి రంగాని చంపిందెవరు.? ఏ రాజకీయం ‘కాపు సింహం’ ఉసురు తీసింది.? వంగవీటి రంగా అంటే ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల దృష్టిలో బలమైన నాయకుడు. ఉన్నత కులాల్లో కూడా రంగా అభిమానులున్నారు. కానీ, ఆయన మీద ‘కాపు ముద్ర’ వేసేశారు కొందరు. ‘కాపు నాయకుడు’గానే ఆయన్ని చంపేశారు కూడా.

బెజవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా పేరు ప్రస్తావనకు రాకుండా వుండడం అనేది జరగని పని.. అన్నట్టగా తయారైంది పరిస్థితి. చాలా ఏళ్ళుగా అక్కడ అదే ట్రెండ్ నడుస్తోంది. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారనీ, ఈ నేపథ్యంలోనే రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించడంతో.. మళ్ళీ వంగవీటి రంగా హత్య వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

వంగవీటి రాధ తన తమ్ముడని చెప్పుకున్న మంత్రి కొడాలి నాని సైలెంటయ్యారు. వంగవీటి రాధ ఎంతో మంచోడని చెప్పిన వైసీపీ నేతలంతా తెరచాటుకు వెళ్ళిపోయి, వంగవీటి రంగా హత్య గురించి ఘాటైన కామెంట్లు చేస్తూ కొందరు వైసీపీ నేతలు ముందుకొస్తున్నారు.

టీడీపీలో ఎంత యాక్టివ్‌గా వంగవీటి రాధ వున్నారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన ప్రస్తుతానికి టీడీపీ నాయకుడే. దాంతో, టీడీపీ అధినేత చంద్రబాబుకి కాస్త లీడ్ దొరికింది.. వంగవీటి రాధతో మాట్లాడారు.. రాధకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసేశారు. రాధ హత్యకు రెక్కీ నిర్వహించినవారిని అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసేశారు చంద్రబాబు.

ఇంకేముంది.? చంద్రబాబు కారణంగానే వంగవీటి రంగా హత్యకు గురయ్యారంటూ వైసీపీ నేతలు (కొందరు మంత్రులు కూడా) గళం విప్పడం మొదలు పెట్టారు. అలాంటి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో వంగవీటి రాధ ఎలా వుంటారంటూ వైసీపీ నేతలు ప్రశ్నించేస్తున్నారు. నిన్నటిదాకా రాధ అంటే మంచోడు.. ఇప్పుడేమో చెడ్డోడైపోయాడు వైసీపీ నేతలకి. ఈ వంగవీటి రాజకీయంలో వైసీపీ రంగులు మార్చుతున్న వైనం బెజవాడ వాసుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నిజానికి, చంద్రబాబు మళ్ళీ పుంజుకునేందుకు రాధ రూపంలో అవకాశం దొరికింది గనుక, ఆయనా తనదైన స్టయిల్లో సరికొత్త స్క్రీన్ ప్లే కోసం సిద్ధమయిపోయారుగానీ, ఇన్నాళ్ళూ ఆయన రాధని ఎందుకు పట్టించుకోలేదట.? తిలా పాపం తలా పిడికెడు.. అన్నట్టు, వంగవీటి రాజకీయంలో వైసీపీ, టీడీపీ చెరి సగం భాగం తీసుకోవాల్సిందే.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...