ఔను, ఈ రోజుతో తెలుగు సినిమా పాట పూర్తిగా చచ్చిపోయిందంటూ ఓ అభిమాని తన ఆవేదనను వెల్లగక్కాడు. ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు తుది శ్వాస విడిచిన విషయం విదితమే. సిరివెన్నెల ఇక లేరన్న వార్త తెలుగు సినీ అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఈ విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే కేవలం పాటల రచయిత కాదు. ఆయనో మంచి స్నేహితుడు. ఆయనో మంచి గురువు. సిరివెన్నెలను కలిసే అవకాశం చాలా తక్కువమందికి లభించి వుండొచ్చు. కానీ, సిరివెన్నెలతో స్నేహాన్ని, సిరివెన్నెల నేర్పిన పాఠాల్ని.. లక్షలాది మంది అనుభూతి చెందారు.. ఆయన్ని కలవలేకపోయినాసరే. అదే సిరివెన్నెల ప్రత్యేకత.
ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సందర్భంలో చెప్పిన మాట, ‘లేచి నిల్చుని, చేతులు రెండూ ప్యాంటు జేబుల్లో పెట్టుకుని అలా వెళ్ళిపోయాను..’ ఎంతలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ‘సింధూరం’ సినిమా చూసినవారికి, అందులో సిరివెన్నెల చెప్పిన గొప్ప మాటకీ.. చాలామంది దాన్ని అనుభూతి చెందారు కూడా.
‘చిరునవ్వుతో’ సినిమాలో అయితే, ‘చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు.. చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ లెందుకు..’ అంటారు సిరివెన్నెల. ఓ స్నేహితుడు మనకిచ్చే సలహాలా వుంటుందిది.
ఒకటా.? రెండా.? వందల కొద్దీ వున్నాయి ఇలాంటివి. చెప్పుకుంటూ పోతే, రోజులు సరిపోవు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని.. అని ప్రశ్నించడం సిరివెన్నెలకు మాత్రమే చేతనైంది. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. అనడం సిరివెన్నెలకు కాకుండా ఇంకెవరికైనా చేతనైందా.?
సిరివెన్నెల పాటలు మనమెలా జీవించాలో చెబుతాయి.. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఎవరన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరని.? తెలుగు భాష వున్నంతకాలం.. తెలుగు సినిమా వున్నంతకాలం.. తెలుగు సినిమా పాట వున్నంతకాలం.. సిరివెన్నెల జీవించే వుంటారు. సిరివెన్నెలకు మరణం లేదంతే.!
– సింధు
93182 521531Awesome read , Im going to spend a lot more time researching this topic 769772
155784 785310Largest lover messages were made to share it along with your and gives honour with the bride and groom. Extremely sound systems facing unnecessary throngs of folks ought to take into account each of our valuable concept of all presenting, which is ones trailer. greatest man toasts 247125