బిగ్ బాస్ సీజన్ 5 లో అతి కీలకమైన ఘట్టం టికెట్ టు ఫినాలే వచ్చింది. ఇందులో విజయం సాధించి ఒకవేళ నామినేషన్స్ నుండి సేవ్ అయితే కనుక డైరెక్ట్ ఫైనల్స్ కు చేరతారు. ఫైనల్స్ కు వెళ్లిన ఫస్ట్ కంటెస్టెంట్ గా నిలుస్తారు. కాబట్టి, హౌజ్ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ టికెట్ టు ఫినాలే అనేది అత్యంత కీలకంగా మారుతుంది.
టికెట్ టు ఫినాలే లో భాగంగా స్పీడ్, యాక్షన్, ఎండ్యూరన్స్ అని మూడు టాస్క్ లు ఇచ్చారు బిగ్ బాస్. సమయానుసారం మూడు టాస్క్ లలో ఒకదాన్ని కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఎంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా అందరూ ఎండ్యూరన్స్ ను ఎంచుకున్నారు. ప్రతీ టాస్క్ లో ఫస్ట్ వచ్చిన వారికి 7 పాయింట్లు, సెకండ్ వచ్చిన వారికి 6 పాయింట్లు, లాస్ట్ వచ్చిన వారికి 1 పాయింట్ లభిస్తుంది. అలా ప్రతీ రోజూ లాస్ట్ కి బాటమ్ 2 లో ఉన్న వాళ్ళు టికెట్ టు ఫినాలే రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఫైనల్ గా ఎక్కువ పాయింట్స్ గెలుచుకున్న వ్యక్తి టికెట్ టు ఫినాలే దక్కించుకుంటారు.
ఈ టాస్క్ లో ముందుగా ఐస్ టబ్స్ ఇచ్చి అందులో నిలబడాలని టాస్క్ ఇచ్చారు. దాంతో పాటు తమకు ఇచ్చిన బాల్స్ ను రక్షించుకోవాలి. ఎవరైనా ఒక పాదం కింద పెడితే వారి బాల్స్ ను తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
అయితే ఈ టాస్క్ మొదలవ్వడం కంటే ముందు మానస్, ప్రియాంకల మధ్య గొడవ చాలా సేపు సాగింది. కాజల్ ను ఎందుకు నామినేట్ చేసావంటూ మానస్, ప్రియాంకను ప్రశ్నించడంతో మొదలైన గొడవ చాలా సేపు కొనసాగింది. మధ్యలో కాజల్ వచ్చి మానస్ కు సపోర్ట్ ఇవ్వడం, దానికి ప్రియాంక తనను మాటలు అనడం జరిగాయి. మానస్ పదే పదే నాకు నీతో మాట్లాడాలని లేదు అని అంటూ ఉన్నా కానీ ప్రియాంక పదే పదే వచ్చి మానస్ నాతో మాట్లాడు అని అనడం, మానస్ విసుక్కోవడం, ఇలా రాత్రంతా అదే జరిగింది. చివరికి మానస్ వచ్చి ప్రియాంకతో కామ్ గా మాట్లాడినప్పుడు ఇద్దరూ హగ్ చేసుకోవడంతో వారి గొడవ సద్దుమణిగింది. నెక్స్ట్ డే కాజల్ వద్దకు ప్రియాంక వెళ్లి నా మనసులో నుండి ఏదీ రాలేదు అని చెప్పడంతో వాళ్ళ గొడవ కూడా సమసిపోయింది.
325868 803739Definitely composed content material , Actually enjoyed examining . 950091
720712 137947Hi, you used to write excellent articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past couple of posts are just a little out of track! 573484
665085 491135Hey, you used to write exceptional, but the last few posts have been kinda boringK I miss your super writings. Past few posts are just a bit out of track! come on! 978689
950994 876839Yay google is my world beater assisted me to uncover this wonderful web internet site ! . 124065