కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేయడమే కాదు.. ఏకంగా లక్ష మందికి పైగా ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఈ వైరస్ అదుపులోకి వచ్చేసరికి ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో చెప్పలేం.
ఇది కరోనా వైరస్ అనే నాణేనికి ఒకవైపు అయితే, ఆర్థికంగా ఇది చూపించే ప్రభావాలు నాణేనికి మరోవైపు. ఇప్పటికే పలు రంగాలు కరోనా ధాటికి కకావికలం కాగా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఐటీ రంగం సహా ఇప్పటికే పలు సంస్థలు అవసరం లేని ఉద్యోగులను తగ్గించే పనికి శ్రీకారం చుట్టాయి.
ప్రపంచంలోని ప్రతి ఐదుగురి ఉద్యోగుల్లో కేవలం ఒకరి జాబ్ మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇప్పటికే పేర్కొంది. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయని స్పష్టంచేసింది. పలు రంగాలు తీవ్రంగా నష్టపోయినందున రాబోయే రోజులలో ఈ ప్రభావం ఉద్యోగాలపై పడుతుందని ఐఎంఎఫ్ చీఫ్ పేర్కొన్నారు.
తాజాగా లండన్ లో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ప్రమాదంలో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం లండన్ లో 3.2 కోట్ల మంది ఉద్యోగస్థులు ఉండగా.. వారిలో దాదాపు 56 లక్షల మందికి ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు కంపెనీల మూత కారణంగా దాదాపు 16 లక్షల మంది రోడ్డున పడ్డట్టు వివరించింది.
ఇక కరోనా ధాటికి దారుణంగా దెబ్బతిన్న అగ్రరాజ్యం అమెరికాలోనూ నిరుద్యోగిత రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. గురువారం కొత్తగా మరో 66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 1.60 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు తేలింది.
మనదేశంలో కూడా పలువురి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి. కాస్ట్ కటింగ్ లో భాగంగా పలు సంస్థలు ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి కరోనా కారణంగా అటు ఆరోగ్యం ఇటు ఆర్థికం రెండూ ఘోరంగా దెబ్బతిన్నాయి.
119497 78850excellent . Thanks for informations . Ill be back. Thanks again 224635
619696 928291You must participate in a contest for among the top blogs on the web. I will suggest this web site! 290699
874928 890870Some truly outstanding articles on this internet website , regards for contribution. 612153