Sitara : మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సేవా గుణం గొప్పది. ఎంతో మంది చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించడం ద్వారా కొన్ని వేల కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. అలాంటి మహేష్ బాబు కూతురు సితార పేరుతో మోసాలు జరుగుతున్నాయి.
సితార పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయడం ద్వారా కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లుగా మహేష్ బాబు టీం గుర్తించిందట. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి సేవా కార్యక్రమాలకు అయినా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్నట్లుగా వారు అధికారికంగా పేర్కొన్నారు.
మహేష్ బాబు కూతురు సితార పేరుతో ఏ ఒక్కరు డబ్బు డిమాండ్ చేసినా కూడా మోస పోవద్దు అంటూ వారు పేర్కొన్నారు. ఇప్పటికే మోసాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సితార పేరుతో వచ్చే నోటిఫికేషన్స్ మరియు రిక్వెస్ట్ లకు స్పందించవద్దు అంటూ మహేష్ బాబు టీం విజ్ఞప్తి చేసింది.