Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదలకు ముందే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాకు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. ఇటీవల సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ తో రూపొందబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించబోతుంది అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరై ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
పలువురు ముద్దుగుమ్మలను సంప్రదించిన తర్వాత చివరకు జాన్వీ కపూర్ కే బుచ్చిబాబు ఓటు వేశాడు అన్నట్లుగా సమాచారం అందుతోంది. బుచ్చిబాబు మొదటి నుంచి కూడా జాన్వీ నే అనుకుంటున్నాడు. అయితే ఆమె ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. దాంతో మరో హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశాడట. కానీ చరణ్ కు అసలైన సరి జోడీ జాన్వీ అని బుచ్చి బాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.