Switch to English

ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టిన ‘బేబీ’ సమంత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

హీరోయిన్‌ సమంత అక్కినేని తల్లి కాబోతోందట.. అంటూ పెద్దయెత్తున సోషల్‌ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. అది కాస్తా వెబ్‌ మీడియా అంతటా తిరిగేసింది. ఇలాంటి పుకార్లపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో క్లారిటీ ఇచ్చేసే సమంత, ఈసారీ అదే పని చేసింది. ‘అవునా, ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యిందా? మీకెప్పుడు తెలిసింది.? నాక్కొచెం చెప్పరూ..’ అంటూ సమంత సోషల్‌ మీడియా వేదికగా వేసిన సెటైర్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘సెలబ్రిటీలపై ఇలాంటి గాసిప్స్‌ మామూలే.. ముందస్తు విషెస్‌గా తీసుకోండి మేడమ్‌..’ అంటూ కొందరు సమంతకి ఉచిత సలహాలు ఇస్తోంటే, ‘అదిరిపోయే రిప్లయ్‌ ఇచ్చారు..’ అంటూ మరికొందరు ఆమెను అభినందిస్తున్నారు. ‘ఏమాయ చేశావె’ సినిమా సమంతకీ, నాగచైతన్యకీ మధ్యన స్నేహాన్ని పుట్టిస్తే, అది పెరిగి పెద్దదయి.. చాన్నాళ్ళకు ప్రేమగా మారి, ఎలాగైతేనేం పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ ఇప్పుడు భార్యా భర్తలుగా మారారు.

పెళ్ళయ్యాక సమంత, సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. నాగచైతన్య సంగతి సరే సరి. ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా వున్నారు. నాగచైతన్యతో పోల్చితే, సమంత కెరీర్‌ చాలా వేగంగా కన్పిస్తోందిప్పుడు. ఇంతటి బిజీ టైమ్‌లో, ‘ప్రెగ్నెన్సీ..’ అంటూ పుకార్లు వస్తే, చిర్రెత్తుకొచ్చేయదూ! కానీ, అక్కడున్నది ‘బేబీ’ సమంత. అందుకే, చాలా క్యూట్‌గా ఇవ్వాల్సిన రిప్లయ్‌ని సోషల్‌ మీడియాలో కొంచెం ఘాటుగా ఇచ్చేసింది.

ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోంది. ‘మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్న విషయం విదితమే. ఓ వృద్ధురాలు, పొటో స్టూడియోకి వెళ్ళి అనూహ్యంగా ఇరవయ్యేళ్ళ వయసు యువతిగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన పరిణామాలే ఈ సినిమా కథాంశం.

సమంత సరసన నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వృద్ధురాలి పాత్రలో లక్ష్మి నటిస్తోంది. ఆ వృద్ధురాలి యంగ్‌ వెర్షన్‌ సమంత. సమంతకి కొడుకు, మనవడు కూడా వుంటాడీ సినిమాలో. సమంత కొడుకుగా రావు రమేష్‌, మనవడిగా ‘ఇంద్ర’ ఫేం బాల నటుడు తేజ (ఇప్పుడు యుక్త వయసుకొచ్చాడు లెండి) నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ మరో కీలక పాత్రలో కన్పించబోతున్నాడు.

Related Posts

ఒకే ఒక్కడు కౌశల్‌ – ది రియల్‌ ‘బిగ్‌బాస్‌’!

న్యూ ఫొటోస్: కైరా అద్వానీ

ఆర్జీవీ పంచ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌!

పవన్ రీమేక్ సినిమాకు వెరైటీ టైటిల్?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...