మూవీ: అలా వైకుంఠపురములో
మ్యూజిక్ : థమన్ ఎస్ఎస్
సింగర్: సిద్ శ్రీరామ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సాంగ్: సామజవరగమన
‘నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు’ అంటూ సిద్ శ్రీరామ్ వాయిస్ విన్న వెంటనే కనెక్ట్ అవుతుంది. ఆ వెంటనే మొదలయ్యే కీ బోర్డ్ – వయోలిన్ మిక్సింగ్ సౌండింగ్ ఫెంటాస్టిక్. పక్కాగా ఈ ట్యూన్ అందరి రింగ్ టోన్ గా మారడం ఖాయం. అలాగే ఒక మంచి టెంపోలో వచ్చే సామజవరాగమన లైన్ సిద్ శ్రీరామ్ పాడిన విధానం మరియు అక్కడ చెవులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా థమన్ బీట్స్ వాడిన విధానం సూపర్బ్. ఒక అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ, ఆమె అందం అతని చూపులని పట్టించుకోపోతే ఎలా ఉంటుందా అనే ఫీలింగ్స్ ని సిరివెన్నెల సీతారామశాస్త్రి తన పదజాలంతో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా ఈ మధ్య పెద్దగా వాడని కావ్య భాషలోని పదాలను అమ్మాయి అందాన్ని వర్ణించడం కోసం వాడడం ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
థమన్ కెరీర్లోనే ఇలాంటి మెలోడియస్ ఆర్కెస్ట్రా చేయలేదనే చెప్పాలి. పల్లవి చరణాల టైంలో మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది, అలాగే పల్లవి చరణాల మధ్య వచ్చే బీట్స్ టెంపో మనచేత మనకే తెలియకుండా స్టెప్స్ వేయించేలా ఉంది. ఇంత హృద్యమైన మ్యూజిక్, లిరిక్స్ కి సిద్ శ్రీరామ్ వాయిస్ ఈ పాటని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. థమన్ కెరీర్ లోనే ది బెస్ట్ మెలోడీగా ఇది నిలిచిపోతుంది.
తీర్పు: 2019 బ్లాక్ బస్టర్ మెలోడీ ‘సామజవరగమన’.
388081 120745I discovered your web site web site online and check many of your early posts. Maintain on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Searching for forward to reading a lot far more from you finding out later on! 623780
857062 205493articulo agregado a favoritos, lo imprimir cuando llegue a la oficina. 781343