Switch to English

పాపం సాయిరెడ్డి., అంతలో ఎంతమార్పు.?

విజయసాయిరెడ్డి…ఈపేరు తెలియని వాళ్లు ఇప్పుడు ఏపీలో ఎవరూ లేరు.. లాబీయింగులోనూ, రాజకీయానికి తనదైన కలరింగ్ ఇవ్వటంలోనూ సిద్దహస్తుడని హస్తినలో ఆయనకు బాగా పేరు. ఇక ముఖ్యమంత్రి జగన్ కు నమ్మకస్థుడిగా, కష్టాల్లో ఆయనకు అండగా నిలబడ్డ వ్యక్తిగా వైసీపీలో సైతం ఆయనకు టాప్ ప్రయారిటీనే. సీబీఐ కేసుల్లోనే కాదు, పార్టీలో కూడా నెంబర్ టూ స్థానం ఎవరిదంటే అనుమానం లేకుండా ముందుగా గుర్తొచ్చే పేరు సాయిరెడ్డిదే..ఆయన ఫోన్ వచ్చిందంటే కూర్చుని మాట్లాడే మంత్రులుండరు, ఆయన నుండి కబురు వచ్చిందంటే అలర్ట్ అవ్వని ఎమ్మెల్యేలుండరు..ఎందుకంటే సాయిరెడ్డి అంటే జగన్…జగన్ అంటే సాయిరెడ్డి.

ఇదంతా నిన్నా మొన్నటివరకూ కనిపించిన సీన్..కానీ ఇప్పుడు ఆయన సీటుకిందకు నీళ్లొచ్చాయని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ప్రయారిటీని సదరు సాయిరెడ్డి దుర్వినియోగం చేశారన్నది అక్కడి టాక్. పరిస్థితులు, పరిధులు దాటి పోవటమే ఇప్పుడు సాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవటానికి కారణాలన్నది వైసీపీలో ఆయనంటే అసూయపడే వర్గం చెప్పేమాట. కష్టాల్లో ఉన్నపుడు వెంట ఉన్నాడని విలువనిస్తే ఇప్పుడు సాయిరెడ్డి వ్యవహారం ప్రభుత్వానికి అదనపు కష్టాలు తెచ్చిపెడుతోందన్నది వారి మాటల సారాంశం. అసలే జగన్ చుట్టూ ఉన్న ఓ కోటరీ ఆయన్ని పక్కదారిపట్టిస్తోందనీ, ముగ్గురు నలుగురు సీనియర్ రెడ్డీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కూడా అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

సరే…వీటిలో నిజమెంతన్నది పక్కనబెడితే రెండురోజులుగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు అటూ ఇటూ వెళ్లి సాయిరెడ్డి దగ్గరే ఆగిపోతున్నాయి. మొన్న వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ ప్రమాదం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ఇంచుమించు జగన్ సాయిరెడ్డిని తన కారునుండి దించేసిన దృశ్యాలు కూడా అంతే చర్చకు తెరదీశాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. ఇదేంట్రా బాబూ, మధ్యలో నన్ను టార్గెట్ చేశారనుకుని సాయిరెడ్డి చెప్పారో లేక ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయో కానీ మంత్రి ఆళ్లనాని సాయిరెడ్డి కారు నుండి దిగిన ఘటనపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీలో ఆయన ప్రాధాన్యత అసామాన్యం, అనిర్వచనీయమని కూడా సదరు మంత్రి ముక్తాయింపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రితో సాయిరెడ్డి వైజాగ్ కు వెళ్లకపోవటమే కాదు, ఆ తర్వాత కూడా సాయిరెడ్డి కేంద్రంగానే వైసీపీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి సాయిరెడ్డి ట్రస్టుకు భారీ విరాళాలు వచ్చాయనీ, ఆ కంపెనీ వ్యవహారాల్లో పార్టీ అధికారం వచ్చినప్పటి నుండే ఆయన తలదూర్చుతున్నారన్నది విపక్షాల విమర్శలు.

దీంతో వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ముఖ్యమంత్రి జగన్ ప్రకటంచకముందు నుండే అక్కడ చక్రం తిప్పుతున్న సాయిరెడ్డి తాజావరుస ఘటనలతో ఒక్కసారిగా అభద్రతాభావానికి గురయ్యారు. పరిస్థితులు ఈపాటికి అనుకూలించి ఉంటే రేపు జూన్ నుండి విశాఖలో జెండా ఎగరేయాలని చూస్తే కరోనా దెబ్బ కొంత, హైకోర్టు అక్షింతలు మరికొంత సాయిరెడ్డి దూకుడుకు బ్రేక్ వేశాయి. ఇప్పుడు ఏకంగా ఎల్జీ కంపెనీ ప్రమాదం స్పీడ్ బ్రేకర్ మాదిరిగా అడ్డుపడింది. మరి ఇప్పటికే సాయిరెడ్డి తీరుపై భారతీమేడమ్ కూడా అసంతృప్తితో ఉన్నారనీ, ఆయనకు చెక్ పెట్టేందుకు బంధువైన సజ్జల ను కూడా రంగంలోకి దింపారనీ కూడా చెవులు కొరుక్కుంటున్న తరుణంలో సాయిరెడ్డికి టైం అంతగా కలిసి వస్తున్నట్లు కనిపించటం లేదని పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకైనా మంచిది సాయిరెడ్డి ఈసారి వైజాగ్ వెళ్తే స్వామి స్వరూపానందగారిని ఒకసారి కలిసి వస్తే బెటరేమో..సాయిరెడ్డి గారూ మీకు ఆల్ ది బెస్ట్ అండీ..

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...