తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో.. ఓ భూవివాదంలో వృద్ధుడు, అతని కుటుంబంపై సాక్షి విలేకరి చేసిన దౌర్జన్యం సంచలనం రేపింది. ‘నన్ను చంపొద్దయ్యా.. అయ్యా.. చంద్రబాబూ.. తెలుగుదేశం నాయకులూ.. కాపాడండి’ అని వీడియోలో వేడుకున్నాడు. విలేకరి కాళ్లు పట్టుకుని వృద్ధుడు వేడుకుంటున్నా.. బలవంతంగా ఆయన్ను విసిరేస్తూ.. అసభ్య పదజాలంతో దూషించాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామంలో జరిగిందీ సంఘటన.
ఘటనపై టీడీపీ స్పందించింది. తనపై జరిగిన దాడిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో కోటేశ్వరరావు వివరించారు. ‘అయ్యా.. ముఖ్యమంత్రి జగన్ గారూ.. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారూ.. మిమ్మల్ని నమ్మి ఓట్లేశాం. మీ ముందు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటారా.. దౌర్జన్యాలు కనిపించట్లేదా.. సాక్షి విలేకరి నాగిరెడ్డి అరాచకాలు సీఎం దృష్టికి రావట్లేదా. వృద్ధుడినని కూడా చూడకుండా నా గుండెలపై తన్నాడు. నాగిరెడ్డి వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మమ్మల్ని రక్షించండి’ అని వాపోయారు.
ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. సాక్షి గూండాల బరి తెగింపు.. సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదంతో పేట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరచాకాలను కట్టడి చేయలేరా..? అని ప్రశ్నించారు. కాళ్లు పట్టుకుని వేడుకున్నా సాక్షి విలేకరి దాడికి పాల్పడటం దుర్మార్గం అని లోకేశ్ అన్నారు.
మరోవైపు.. కోటేశ్వరరావు, నాగిరెడ్డి వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ‘కాళ్లు పట్టుకోవద్దని వారిస్తున్న సమయంలో కోటేశ్వరరావు వెనక్కి పడిపోయాడు. తాను దాడి చేయలేదని నాగిరెడ్డి చెప్తున్నాడు. ఫోన్ లాక్కుంటూ మహిళలే నాగిరెడ్డిపై దౌర్జన్యం చేశారు’ అని అన్నారు. చంద్రబాబు ఈ అంశాన్ని అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు….! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి… వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదం తో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా @ysjagan pic.twitter.com/oYILp7AJr2
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2022
373459 863773I like this weblog it is a master piece! Glad I discovered this on google. 116247
543016 429626Just wanna comment which you have a really nice internet internet site , I really like the design it actually stands out. 718565
361568 514379Hi, you used to write superb articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past few posts are just a bit out of track! 892622