Switch to English

‘ఆర్ఆర్‌ఆర్‌’ రివ్యూ : ఇద్దరు స్నేహితుల మాస్‌ జాతర

Critic Rating
( 3.25 )
User Rating
( 3.20 )

No votes so far! Be the first to rate this post.

Movie ఆర్ఆర్‌ఆర్‌
Star Cast రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్
Director ఎస్ఎస్ రాజమౌళి
Producer డివివి దానయ్య
Music ఎంఎం కీరవాణి
Run Time 3 గం 02 నిమిషాలు
Release 25 మార్చి 2022

బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండియన్ సినీ ప్రేమికులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. జక్కన్న తదుపరి సినిమా ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో సినిమాను ప్రకటించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యే వరకు కూడా నిజమేనా అంటూ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే వచ్చారు. 2020 సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చిన జక్కన్న కరోనా వల్ల రెండేళ్ల ఆలస్యంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. జక్కన్న మూవీ కనుక ఖచ్చితంగా విజువల్‌ వండర్‌ గా మూవీ ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఈ చిత్రం కథం 1920 కాలంలో మొదలు అవుతుంది. ఇద్దరు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించినది ఈ కథ. వేరు వేరు ప్రాంతాలకు చెందిన కొమురం భీమ్‌ ( ఎన్టీఆర్‌ ) మరియు సీతరామరాజు ( రామ్‌ చరణ్‌ ) ఎల ఒకరిని ఒకరు కలిశారు.. ఆ తర్వాత వారు ఇద్దరు కలిసి బ్రిటీష్‌ వారిపైకి జనాలతో ఎలా స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా యుద్దం చేశారు.. ఆ యుద్దంలో వారిద్దరు సాధించినది ఏంటీ అనేది ఈ సినిమా కథగా జక్కన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

నటీనటుల :

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ లు కెరీర్‌ బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్ ను ఇచ్చారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు ఇచ్చారు అనడం కంటే రాజమౌళి తీసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఏ నటుడు అయినా ది బెస్ట్ ఇచ్చే వరకు రాజమౌళి ఒప్పుకోవడు. తాను అనుకున్న విధంగా వచ్చే వరకు చేస్తూనే ఉంటాడు. ఇద్దరు హీరోల ది బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్ క్రెడిట్ రాజమౌళికి కూడా దక్కుతుంది అనడంలో సందేహం లేదు. జక్కన్న చెప్పిన పాత్రల కోసం ఇద్దరు హీరోలు మౌల్డ్‌ అయిన తీరు అద్బుతం అనడంలో సందేహం లేదు.

ఇద్దరు హీరోలు వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్‌ గా సెట్‌ అయ్యారు. సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. ఆలియా కూడా నటనతో పాటు తన లుక్ తో మెప్పించింది. అయితే ఆలియా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువే అయినా ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్ తక్కువగా ఉంది. ఉన్నంతలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా చక్కని నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:

రాజమౌళి దర్శకత్వంలో హాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ కు ఏమాత్రం తీసిపోడు అంటూ బాహుబలి సినిమా తోనే నిరూపితం అయ్యింది. ఆయన స్థాయిని ఈ సినిమా మరింత ఎక్కువ పెంచింది అనడంలో సందేహం లేదు. తాను అనుకున్న కథలో ఇద్దరు స్టార్‌ హీరోలను తీసుకుని స్క్రీన్‌ ప్లేను నడిపించిన తీరు అభినందనీయం. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా కోఆర్డినేట్‌ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో ది బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇచ్చేలా వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. సంగీతంతో కీరవాణి ప్రాణం పోశాడు అనడంలో సందేహం లేదు. ఆయన బీజీఎం సూపర్‌. సినిమాటోగ్రపీ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్ :

  • ఎన్టీఆర్‌, చరణ్ నటన,
  • యాక్షన్‌ సన్నివేశాలు,
  • ఇంటర్వెల్‌ ముందు సన్నివేశం,
  • రాజమౌళి మార్క్ మేకింగ్‌.

నెగటివ్ పాయింట్స్:

  • సెకండ్‌ హాఫ్‌ కాస్త స్లో గా ఉంది.
  • బలమైన కథ లేకపోవడం

చివరిగా:

రాజమౌళి నుండి ఇద్దరు స్టార్‌ హీరోల మల్టీ స్టారర్ అనగానే జనాలు.. ప్రేక్షకులు.. అభిమానులు ఏమైతే ఆశించారో.. ఏదైతే కోరుకున్నారో అదే ఇందులో ఉంది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన విజువల్‌ వండర్ గా ఈ సినిమా ను ఆయన మల్చిన తీరు సూపర్. ఇద్దరు హీరోలు కూడా కెరీర్‌ బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడం తో పాటు జక్కన్న ఊహను అందుకుని వారు నటించి మెప్పించారు. ప్రతి సన్నివేశం కూడా ఒక అద్బుతం అన్నట్లుగా సాగింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3.25/5.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గాలి’ దుమారం.!

గాలి జనార్ధన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ గతంలో ఆయన్ని అరెస్టు చేస్తే, న్యాయమూర్తిని సైతం ప్రలోభ పెట్టిన ఘనుడాయన. అపర కుబేరుడు.. ఎంతటి వాడినైనా...

ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య రెమ్యునరేషన్ ఎంత?

బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా లో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. బాలరాజు బోడి పాత్రలో కనిపిస్తాడు చైతన్య. తన...

కాళరాత్రిలో విమాన ప్రమాదం.. సాయం చేసిన గ్రామస్థులకు కృతజ్ఞతగా ఆసుపత్రి

మానవత్వంతో వారు చేసిన సాయానికి కృతజ్ఞత చూపించారు విమాన ప్రమాద బాధితులు. 2020 ఆగష్టు 7న 190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వచ్చిన విమానం కేరళలోని కరిపూర్ గ్రామానికి సమీపంలోని కోజికోడ్...

ఆ అమ్మాయి గురించి మనకు సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే?

సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సుధీర్ బాబు సరసన...