Switch to English

గోకుతున్న ఆర్జీవీ: ‘పబ్లిసిటీ’ వింత జీవికి ఎందుకీ దురద?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చంకలు గుద్దుకోవడమేంటట? ఆయనంతే, అదో టైపు. స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ని నందమూరి బాలకృష్ణతో తీద్దామనుకుని భంగపడ్డ దర్శక ‘రాము’డు, ఆ కసినంతా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రూపంలో నారా చంద్రబాబునాయుడు మీద చూపించారు. అదేంటీ, బాలకృష్ణ కదా, ఆర్జీవీని వద్దనుకున్నది, పైత్యం అనేది ఏమన్నా చూపించాలనుకుంటే అది బాలకృష్ణ మీద చూపించి వుండాలి! కానీ, వర్మకి అంత ధైర్యమెక్కడిది? బాలకృష్ణతో పెట్టుకుంటే, వ్యవహారం ఇంకోలా వుంటుంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకుని, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పేరుతో చంద్రబాబు మీదకు బాణం ఎక్కుపెట్టి, ‘దురద’ తీర్చుకున్న వర్మ, దర్శకుడిగా ఆ సినిమాతో పొందిన లాభమేమీ లేదు, కాస్తంత పబ్లిసిటీ దక్కించుకోవడం తప్ప. సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తుస్సుమంటోంటే, ట్విట్టర్‌లో వర్మ పోస్టింగులు మాత్రం భలేగా పేలుతున్నాయి. అదీ ఓ ఘనతేనా? అనకండి. వర్మ స్థాయి సంచలన దర్శకుడి నుంచి, ట్విట్టర్‌ సంచలనం దాకా పడిపోయింది మరి. ఇప్పుడీ వర్మగారు, కులాల మధ్య కుంపటిని రాజేస్తున్నారు.

లేకపోతే, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ సినిమా తీయడమేంటి? సినిమా తీయాలనుకుంటున్నాడంటే, అది ఆయనిష్టం కావొచ్చు. ఓ క్రియేటివ్‌ డైరెక్టర్‌కి ఎలాంటి ఆలోచనైనా రావొచ్చు. దాని పర్యవసానాలు ఫేస్‌ చేయడానికీ రెడీ అవ్వాలి. కానీ, వర్మ రూటే సెపరేటు. ఎవర్నయినా ఆయన తిడతాడు, ఎవరూ ఆయన్ని తిట్టకూడదు. ఏమీ ఊసుపోకపోతే, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని రెచ్చగొడతాడాయన. ‘నన్ను ఈ మధ్య పవన్‌ ఫ్యాన్స్‌ తిట్టడం మానేశారు, ఓసారి తిట్టించుకుంటా’ అని చెప్పి మరీ తిట్టించుకునే రకం వర్మ. అలాగే, ఇప్పుడు కమ్మోళ్ళతో తిట్టించుకుంటున్నారాయన.

కమ్మోళ్ళని అనే కాదు, కులం పేరు చెప్పి ఎవర్ని తక్కువ చూసినా, కులాభిమానం వున్నోళ్ళు ఊరుకుంటారా? తిరగబడ్తారు. అదే వర్మకి కావాల్సింది కూడా. తిట్టించుకుని, తిట్టించుకుని.. చివరికి ‘కనీసం కుక్కల్లా అయినా మొరగండి..’ అని కమ్మోళ్ళకి ఉచిత సలహా ఇచ్చాడు వర్మ. మొరగడమేం ఖర్మ, కరుస్తాం.. అని వర్మ మీద ఎవరన్నా దాడి చేస్తే, ఆ తర్వాత ‘ఇది ప్రజాస్వామ్యమేనా?’ అని గొంతు చించుకోవడానికి వర్మ వేసిన పెద్ద స్కెచ్‌ ఇది. కులాల పేరు చెప్పిన కామెంట్లు చేసినా ‘లోపలోసే’ చట్టాలు వస్తే తప్ప, ఇలాంటోళ్ళకి అడ్డుకట్ట పడే అవకాశం వుండదేమో.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి, తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి.. ఈ రెండు రాజ్యాల్లోనూ.. సారీ సారీ, రాష్ట్రాల్లోనూ అధికారం తనదేనన్నట్లు వర్మ వ్యవహరిస్తే ఎలా? సమాజం మీద బాధ్యత లేదు కాబట్టి, కులాల పేరు చెప్పి నోటికొచ్చింది మాట్లాడతానంటే అది తగదు. వర్మలాంటి గొప్ప దర్శకుడికి అసలే తగదు. అయినా ఆ ‘గొప్ప’ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి, ఇప్పుడు చీఫ్‌ పబ్లిసిటీ స్టంట్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా వర్మ నిలిచిపోయిన సంగతి తెలియనిదెవరికి?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...