వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేయడం లేదా ట్వీట్స్ చేయడం చేస్తూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఆయన సోషల్ మీడియా విజృంభన తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి మెగాస్టార్ ఇంకా మెగా హీరోలపై కామెంట్స్ చేశాడు. ఒక మంచి ఉద్దేశ్యంతో చిరంజీవి ఇంకా నాగార్జున ఇతర మెగా హీరోలు చేసిన కరోనా అవైర్నెస్ పాటపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఆ పాటపై స్పందిస్తూ.. ఈ పాటను కరోనా బ్యాక్టీరియా ఇష్టపడుతుంది. బ్యాక్టీరియా నుండి నాకు ఈ సమాచారం వచ్చింది. తాను కూడా కరోనా వైరస్‌పై ఒక పాటను విడుదల చేయబోతున్నాను. ఏప్రిల్ 1వ తారీకున ఆ పాట విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ పాటతో ఎవరు ఫూల్స్ అవుతారో తెలుస్తుందని అన్నాడు. వర్మ ట్వీట్ మెగా హీరోల పాటకు కామెంట్ అనే విషయం అందరికి అర్థం అవుతుంది.
కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి ముందుకు వచ్చి వారికి సాయం చేసేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడాలి తప్ప ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఎద్దేవ చేసుకోవడం ఏంటీ వర్మ అంటూ నెటిజన్స్ వర్మపై కామెంట్స్ చేస్తున్నారు. కరోనాపై వర్మ విడుదల చేయబోతున్న పాట ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
MEGA emotional MULTISTAR Song on CORONAVIRUS is so mindblowinglyfantastic that intelligence sources from BACTERIA WORLD told even CORONAVIRUS LOVED IT https://t.co/Ba4gWlegmB Am myself releasing my own non emotional CORONA song on APRIL FOOL DAY .LET VIRUS DECIDE WHO IS FOOL
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020
747943 939215Would enjoy to constantly get updated wonderful internet weblog ! . 125002
178716 28883hey I was extremely impressed with the setup you used with this weblog. I use blogs my self so great job. definatly adding to bookmarks. 957754
769764 112770Hello. Cool article. Theres an issue with the site in internet explorer, and you may want to test this The browser may be the marketplace chief and a large element of other folks will miss your wonderful writing due to this issue. 739844
293507 996373Some genuinely good stuff on this internet site , I it. 101