‘కరోనా వైరస్ కారణంగా జరుగుతున్న లాక్ డౌన్‌తో తెలంగాణ ఆదాయం దారుణంగా తగ్గిపోయింది..’ అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన విషయం విదితమే. ‘ఇది మన ఒక్కరి సమస్య కాదు.. దేశమంతా, ప్రపంచమంతా ఇదే పరిస్థితి..’ అని చెప్పిన కేసీఆర్, ఉద్యోగుల వేతనాల్లో ‘కోత’ తప్పదంటూ ఇప్పటికే సంకేతాలు పంపారు.
ఇప్పుడు ఆ ‘కోత’ని అమల్లో పెట్టేస్తున్నారు కూడా. ప్రజా ప్రతినిథుల దగ్గర్నుంచి, నాలుగో తరగతి ఉద్యోగులు, కాంట్రాక్ట్ అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ఈ ‘కోత’ వర్తిస్తుంది. అయితే, ప్రజా ప్రతినిథులకి 75 శాతం వేతనాల్లో కోత విధించనుండగా, ఐఏఎస్ – ఐపీఎస్ అధికారుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించి 10 శాతం కోత విధించనుంది తెలంగాణ ప్రభుత్వం. పెన్షనర్లు సైతం ‘కోత’ పరిధిలోకి రావడం గమనార్హం.
లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకూ పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కరిన నిర్ణయాలు తప్పని పరిస్థితి. అయితే, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్న తెలంగాణలో ఈ ‘వేతనాల కోత’ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణను కేసీఆర్ ‘ధనిక రాష్ట్రం’గా చెబుతూ వస్తున్నారు ఇప్పటిదాకా. అలాంటి ధనిక రాష్ట్రం, కేవలం పదిహేను రోజులకే ఇలా కుదేలవడమేంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
కరోనా దెబ్బ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి దుష్ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ధనిక రాష్ట్రం తెలంగాణ పరిస్థితే ఇలా వుంటే, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంగతేంటి.? భారతదేశం పరిస్థితేంటి.? లాక్ డౌన్ ముగిస్తే తప్ప, మళ్ళీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం లేదు. లాక్ డౌన్ తర్వాత కూడా, పరిస్థితి చక్కబడటానికి ఆరు నెలలు పడుతుందో, ఏడాదే పడుతుందో, రెండు మూడేళ్ళు అవసరమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
595103 30548I dont agree with this particular article. However, I did researched in Google and Ive found out that you are correct and I had been thinking inside the incorrect way. Continue producing quality material similar to this. 459141
751814 851359my English teacher hate me cause i keep writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 214226
380454 609448Wohh exactly what I was searching for, regards for posting . 747109
695926 523885Hi. Cool write-up. There can be a issue with the web site in firefox, and you might want to test this The browser may be the marketplace leader and a huge portion of folks will miss your exceptional writing due to this issue. 822646
177851 340367Discover how to deal along with your domain get in touch with details and registration. Understand domain namelocking and Exclusive domain name Registration. 278359
880422 904557An fascinating discussion might be worth comment. I think you should write on this topic, it may well definitely be a taboo subject but typically individuals are not enough to dicuss on such topics. To a higher. Cheers 948148