పోర్న్ స్టార్ మియా మల్కోవా మళ్ళీ వార్తల్లోకెక్కింది.. అదీ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కారణంగా. ఏంటీ, వర్మ ఏమన్నా మళ్ళీ ‘గాడ్ సెక్స్ ట్రూత్’ సీక్వెల్ ప్లానింగ్ చేస్తున్నాడా.? లేకపోతే, ఆయనెందుకు మియా మల్కోవాని మళ్ళీ గుర్తు చేసుకుంటాడు.? అసలు విషయమేంటంటే, మియా మల్కోవా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటో షేర్ చేసింది. పోర్న్ స్టార్ అయిన మియా మల్కోవా ఎప్పటికప్పుడు తన న్యూడ్ ఫొటోల్నే కాదు, హార్డ్ కోర్ ఫొటోల్ని కూడా షేర్ చేస్తుంటుంది.
తాజా ఫొటో న్యూడ్ కాదు, హార్డ్‌కోర్ అసలే కాదు. జస్ట్ ఓ బికినీ ఫొటో అంతే. బీచ్‌లో బికినీతో సేదతీరుతున్న ఫొటోని మియా మల్కోవా షేర్ చేస్తే, ‘అందాల్ని ఆరాధించడంలో దిట్ట’ అయిన ఆర్జీవీ, ఆమె ఒంపు సొంపుల గురించి తనదైన స్టయిల్లో స్పందించాడు. ‘రెక్టాంగులర్ ట్రయాంగులర్ కర్వ్ ఆఫ్ లవ్’ అంటూ వర్మ, మియా మల్కోవా ఫొటోపై కామెంట్ చేయడంతో, మియా మల్కోవా కూడా స్పందించడం గమనార్హం. ఓ జిఫ్ కార్టూన్ని వర్మకి రిప్లయ్‌గా ఇచ్చింది మియా మల్కోవా.
ఇంకేముంది, వర్మకి మియా మల్కోవా దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు పండగ చేసేసుకుంటున్నారు. రామ్‌గోపాల్ వర్మకి పబ్లిసిటీ స్టంట్లు చేయడమెలాగో బాగా తెలుసు. ‘పవన్ అభిమానులతో తిట్టించుకుని చాన్నాళ్ళయ్యింది..’ అంటూ ఆ మధ్య ఓ ట్వీటేసి, తనక్కావాల్సిన రీతిలో వర్మ, పవన్ అభిమానులతో తిట్టించుకున్న విషయం విదితమే. పబ్లిసిటీ డల్ అయిపోయిందేమో, మళ్ళీ ఇప్పుడు వర్మ, మియా మల్కోవా ఫొటోపై కామెంట్ చేసి ఆయన వార్తల్లోకెక్కాడు, మియా మల్కోవానీ వార్తల్లోకెక్కించాడు. ఏమో, వర్మ ‘జీఎస్టీ-2’ ప్లానింగ్‌లో వున్నాడేమో.!
It’s the Rectangualaric triangular curve of love https://t.co/U5c35RpHT3
— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2019