Switch to English

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నటీనటులు : ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, శివ కార్తికేయన్, కార్తీక్ రాజు తదితరులు ..
రేటింగ్ : 3 / 5
సంగీతం : దిబు నైనన్ థామస్
సమర్పణ ; కె ఎస్ రామారావు
దర్శకత్వం : భీమనేని శ్రీనివాస రావు
నిర్మాత : కే ఏ వల్లభ

తమిళంలో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కాన్సెప్ట్ బేస్డ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఐశ్వర్య నటించిన చిత్రం శైలజ కృష్ణమూర్తి. తమిళంలో కాణా పేరుతొ విడుదలైన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. మొదటి నుండి భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాతో ఐశ్వర్యకు మంచి ఓపెనింగ్ దక్కింది. లేడి క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కౌసల్య ఎలా క్రికెటర్ గా రాణించింది. అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

ఇరగవరం అనే ఊరిలో కృష్ణమూర్తి ( రాజేంద్ర ప్రసాద్ ) వ్యవసాయం చేస్తూనే క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన తండ్రి చనిపోయినా కూడా క్రికెట్ చూసేంత పిచ్చి అతనికి. అలాంటి సమయంలో అతని కూతురు కౌసల్య ( ఐశ్వర్య రాజేష్ ) నేను పెద్దయ్యాక క్రికెటర్ అవుతునని చెప్పడంతో ఆమెను పెద్ద క్రికెటర్ గా చేసి, ఇండియా టీమ్ తరపున ఆడించాలనే లక్ష్యంతో కౌసల్యను తీర్చిదిద్దే ప్రయాత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో అమ్మాయిని క్రికెటర్ గా చేస్తాననడం, ఓ ఆడపిల్ల ఆటలంటూ బయటికి రావడం, సమాజం చిన్న చూపు చూడడం, పొరుగు వాళ్ళు హేళనలు .. ఇలా ఎన్నో కష్టాలనుండి కౌసల్య క్రికెటర్ గా ఎలా రాణించింది. ఆమె ఇండియన్ టీమ్ కు ఆడిందా లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

తన తండ్రికి క్రికెట్ అంటే ఉన్న ఇష్టాన్ని చూసి తన తండ్రి కల కోసం పాటుపడే అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ చక్కని నటన ప్రదర్శించింది. ఆమెకు తన తండ్రి పై ఉన్న ప్రేమ, అతని కోసం తాను చేసే రిస్క్ లాంటి విషయాల్లో ఐశ్వర్య చాలా కష్టపడింది. ఎక్కువ శాతం కళ్ళతోనే ఆమె హావబావాలు పలికించడం, ఎమోషన్స్ ని బాగా పలికించింది. ప్రొఫెషన్ క్రికెటర్ గా కనిపించడం కోసం చాలా హార్డ్ వర్క్ చేసిందని చుస్తే అర్థం అవుతుంది. కౌసల్య గా నూటికి నూరు మార్కులు కొట్టేసింది ఐశ్వర్య. ఇక రైతు గా రాజేంద్ర ప్రసాద్ జీవించేసాడు. భూమి అంటే ప్రాణంగా నమ్మే రైతు గా నేటి రైతు కష్టాలను కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఇక కౌసల్య తల్లి పాత్రలో ఝాన్సీ బాగా చేసింది. కౌసల్య ను ప్రేమిస్తూ ఆమె లక్ష్యం కోసం సపోర్ట్ అందించే ప్రియుడి పాత్రలో సాయి కృష్ణ పాత్రలో కార్తీక్ రాజు చక్కగా నటించాడు. గెస్ట్ గా కనిపించిన శివ కార్తికేయన్ ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఇందులో నటీనటులు అందరు చక్కగా చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమా విషయంలో మ్యూజిక్ ఆకట్టుకుంది. కథను నడిపించడంలో మ్యూజిక్ తోడ్పడింది. అలాగే ఫోటోగ్రఫి కూడా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ ఓకే. అయితే తమిళ కాణా సినిమాలోని చాలా సన్నివేశాలు అలాగే వాడుకున్నారు. ఇక దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావు చాలా రోజుల తరువాత మంచి సినిమా చేసాడు. మొదటి నుండి రీమేక్ సినిమాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న అయన మరోసారి రిమేక్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా చక్కని రీమేక్ ని ఎంచుకుని దాన్ని అద్భుతంగా మలిచాడు. ఇక ఈ సినిమా విషయంలో కథ కొత్తదేమీ కాదు .. తెలిసిన కథే .. దాన్ని నడిపించిన తీరు బాగుంది.

విశ్లేషణ :

క్రీడా నేపథ్యంలో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. క్రికెట్ కథ కొత్తది కాకపోయినప్పటికీ అందులో రైతుల కష్ఠాలను చూపిస్తూ అల్లుకున్న కథ అందరిని ఆలోచింపచేసేలా ఉంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కాణా సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేసారు. ఆసక్తి కలిగించే కథ, జీవితంలో ఓ లక్ష్యాన్ని సాధించాలనే యువతికి ఎదురైనా ఆటంకాలను ఎదుర్కొని ఎలా విజయం అందుకుంది అన్న పాయింట్ సూపర్. నటిగా ఐశ్వర్యా మంచి మార్కులు కొట్టేసింది. ఎమోషన్స్ తో పాటు నిజమైన క్రికెటర్ గా కనిపించేందుకు ఆమె ఎంతో హార్డ్ వర్క్ చేసిందో తెలిసిపోతుంది. మ్యూజిక్, కెమెరా ఆకట్టుకునే అంశాలు. తెలిసిన, కథ .. నెక్స్ట్ ఏమి జరుగుతుందో ముందే ఊహించే అంశాలు కాస్త మైనస్ గా అనిపిస్తాయి .. మొత్తానికి కౌసల్య కృష్ణమూర్తి ఓ మంచి ప్రయత్నం అని చెప్పాలి.

ట్యాగ్ లైన్ : కౌసల్య .. ఆకట్టుకుంది !

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...