Switch to English

ఈడీ, సీబీఐ: స్వతంత్ర (లేని) దర్యాప్తు సంస్థలేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. భారత స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. కానీ ఇటీవల అవి స్వతంత్రత లేని దర్యాప్తు సంస్థలుగా మారిపోయాయనే విమర్శలు ఎక్కువయ్యాయి. దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మనదేశంలో ఉన్నంతగా ఎక్కడా ఉండదేమో. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీలపై అస్త్రాలుగా ఈ స్వతంత్ర సంస్థల్ని వినియోగించుకోవడం ఆనవాయితీ అయిపోయింది. దీంతో అధికారంలో ఉన్నవారికి ఆ సంస్థలు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం సీబీఐ కేసులతో కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లారు. ఆయన్ను జైలుకు పంపించడంలో కీలకపాత్ర మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే. తనను ఒకప్పుడు ఏ సంస్థతో అయితే చిదంబరం జైలుకు పంపించారో, ఇప్పుడు అదే సంస్థతో ఆయన్ను జైలుకు పంపించడంలో షా విజయవంతమయ్యారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే ఒరవడి అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఇలా దర్యాప్తు సంస్థల్ని సొంతానికి వినియోగించుకోవడం మొదలైంది మాత్రం కాంగ్రెస్ హయాంలోనే.

పదేళ్ల యూపీఏ పాలనలో సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేసినంతగా ఏ సర్కారూ చేయలేదు. తమ మాట వినని, తమ దారికి రాని నేతలపై సీబీఐ, ఈడీలను ప్రయోగించి ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ వ్యవహారంపై పలు విమర్శలు, ఆరోపణలు చేసింది. యూపీఏకి అధికారం పోయి బీజేపీ గద్దెనెక్కింది. అప్పటివరకు ఉన్న ఈ దుస్సంప్రదాయాన్ని కొత్త సర్కారు మారుస్తుందేమోనని చూసినవారికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ సైతం నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది.

ఎందుకంటే ప్రత్యర్థుల ఆట కట్టించడానికి బ్రహ్మాండంగా అక్కరకొచ్చే ఈ బ్రహ్మాస్త్రాలను ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందుకే బీజేపీ సైతం అదే బాటలో పయనిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరినవారికి కేసులకు సంబంధించి ఎలాంటి కష్టాలూ ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం. బీజేపీలో చేరక ముందు వరకు ఉన్న కేసులు.. కాషాయ కండువా కప్పుకోగానే పక్కకు వెళ్లిపోతున్నాయి. దీంతో తమ భద్రత దృష్ట్యా పలువురు బీజేపీ బాట పడుతున్నారు. ఇలా దర్యాప్తు సంస్థల బూచితో భారత్ లో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ ఒరవడికి ముగింపు ఎప్పుడు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే మొన్న చిదంబరం చేశారు.. ఇప్పుడు షా చేస్తున్నారు.. రేపు మరొకరు చేస్తారు. అధికారంలో ఎవరున్నా ఈ వ్యవహారం మాత్రం కామన్ గా కొనసాగడం ఖాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...