Switch to English

కరోనా కేసులు తగ్గుతున్నాయ్‌.. అనుమానాలు పెరుగుతున్నాయ్‌.!

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లక్షకు పైగా కరోనా టెస్టులు చేసేసింది. తెలంగాణ లెక్క ఇంకా 20 వేలకు అటూ ఇటూగానే వుందట. ఇంతకీ, ఈ మతలబు ఏంటట.? ఇదే అంశం చుట్టూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రానికి ఓ లేఖ రాశారు. తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయన్నది బండి సంజయ్‌ ఆరోపణ. కేంద్రం తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన తన లేఖలో కేంద్రాన్ని కోరారు. పరీక్షలు తక్కువగా చేస్తూ, తెలంగాణలో కరోనా తీవ్రతను తక్కువ చేసి చూపిస్తోందని బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు. నిజమేనా.?

తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు తక్కువగా చేస్తున్నది కరోనా వైరస్‌ తీవ్రత కన్పించనీయకుండా చేసేందుకేనా.? సగటు తెలంగాణ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఈ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ‘మేం అడ్డగోలుగా పరీక్షలు చేయడంలేదు.. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు మాత్రమే పరీక్షలు చేస్తున్నాం..’ అని తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ ఈటెల రాజేందర్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పైగా, ‘మేం కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోకపోతే, తెలంగాణ కూడా కర్నూలులాగానో, గుంటూరులాగానో తయారయ్యేది..’ అంటూ ఈటెల రాజేందర్‌ నిన్న ఘాటైన పొలిటికల్‌ బాంబు కూడా పేల్చారు.

దాంతో, ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడ్తోంది. సోషల్‌ మీడియాలో వైసీపీ మద్దతుదారులు ఈటెల రాజేందర్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. మరోపక్క, తెలంగాణ మద్దతుదారులు, ఏపీలోని అధికార పార్టీపై సెటైర్లు వేస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో ముదురుతున్న వివాదానికి తోడు, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కేంద్రానికి రాసిన లేఖతో కరోనా టెస్టులపై రాజకీయ రచ్చ నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళుతోంది. ఇంతకీ, తెలంగాణలో తక్కువ పరీక్షలు జరగడంపై కేంద్రం స్పందిస్తుందా.? తక్కువ పరీక్షలు చేయడంతోనే కరోనా కేసులు తెలంగాణలో తక్కువగా నమోదవుతున్నాయా.? ఏమో, ఏం జరుగుతోందో.. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిందే.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

‘సర్కార్‌ వారి పాట’ స్టోరీ లైన్‌ ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 27వ చిత్రం పరశురామ్‌ దర్శకత్వంలో అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ లాక్‌ డౌన్‌...

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...