Switch to English

ఖజానాకి మద్యం కిక్కు: ‘లక్కీ ఛాన్స్‌’ మిస్సవుతున్న జగన్‌.!

మద్యం సేవిస్తే.. అది చాలా రోగాలకు కారణమవుతుంది. డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, కొలెస్టరాల్‌ సమస్యలు, కిడ్నీ, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇలా ఒకటేమిటి.? శరీరం సర్వనాశనమైపోతుంది ఆల్కహాల్‌ సేవించడం ద్వారా. ఇది వైద్యులు చెబుతున్న మాటే.. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న విషయమే. కానీ, ఆ మద్యం అమ్మకాల ద్వారా ‘ఖజానాకి లభించే కిక్కు’ కోసం అవే ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తుంటాయి.

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం బంద్‌ అయ్యింది. అద్భుతమైన అవకాశమిది. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. పాలకులకి ప్రజారోగ్యం మీద బాధ్యత వుంటే, పూర్తిగా దేశం నుంచి మద్యాన్ని తరిమివేయడానికి ఇంతకు మించిన అవకాశం ఇంకోసారి రానే రాదు. రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గిపోతాయ్‌.. మద్యాన్ని నిషేధించేస్తే. కానీ, అంత చిత్తశుద్ధి పాలకులకు వుంటుందని ఎలా అనుకోగలం.?

కేంద్రం సంగతి పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎలాగూ మద్య నియంత్రణ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మరి, ఇప్పుడాయన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా.? ఛాన్సే లేదు. అటు కేంద్రం మద్యం అమ్మకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి.. రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలు తెరుచుకోవడానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుమతిచ్చేసింది. మద్యం డిస్టిలరీల్లో సిగరెట్‌ స్మోకింగ్‌, పాన్‌, గుట్కా వంటివి నిషేధమట. ఇదే మరి కామెడీ అంటే.!

తెలంగాణలో మద్యం కిక్కు తగలక.. చాలామంది మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు.. కొందరు ఆసుపత్రుల పాలయ్యారు కూడా. అంతటి దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా తలెత్తలేదు. సరిగ్గా, ఈ సమయాన్నే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సద్వినియోగం చేసుకోగలిగి వుంటే.. చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖితమయ్యేదే. కానీ, బంపర్‌ ఛాన్స్‌ని మిస్‌ అవుతున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

కరోనా వైరస్‌ సోకకూదని మాస్క్‌లు, శానిటైజర్లు వాడమంటున్నారు.. గుండె జబ్బులు, లివర్‌ సమస్యలు రాకుండా మద్యం తాగొద్దని చెప్పలేరా.? ఆ మద్యాన్ని నిషేధించలేరా.? ముఖ్యమంత్రిగారూ.. కాసింత ఆలోచించండి సారూ.!

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

ఈసారి సూర్య ఆ పని చెయ్యట్లేదు.!

తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న కొంత మంది తమిళ హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తమిళంలో సినిమా...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...