Switch to English

జంపింగ్‌ జపాంగ్స్‌: జనసేనని ముంచేసింది వీళ్ళే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఏం జరిగిందో చూశాం. చిరంజీవి ఎవర్నయితే బాగా నమ్మారో, వాళ్ళంతా ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఉన్నతమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, ఈ రంగంలో ప్రజల కోసం ఎదుర్కొనాల్సిన పెను సవాళ్ళ కంటే వెన్నుపోట్లే ప్రమాదకరమైనవని తెలుసుకోవడానికి పెద్దగా టైమ్‌ పట్టలేదు. ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనవడం వెనుక అసలు కోణాలేమిటో పవన్‌ కళ్యాణ్‌ చాలా సందర్భాల్లో చెప్పారు. కొన్నాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు చిరంజీవి గుడ్‌ బై చెప్పేశారు.

ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? ప్రజారాజ్యం నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఏం పాఠాలు నేర్చుకున్నారు? రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసమంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌, తాజా ఎన్నికల ఓటమి తర్వాత ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు? అనే ప్రశ్నలు ఆయన అభిమానుల మెదళ్ళను తొలిచేస్తున్నాయి. అయితే, ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్‌ కళ్యాణ్‌ సరిగ్గా పాఠాలు నేర్చుకోలేదనే విషయం అర్థమవుతోంది. అందుకు ఉదాహరణ, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, జనసేన పార్టీని వీడటం.

అసలాయన్ను పార్టీలోకి చేర్చుకోవడమే పెద్ద తప్పిదమని అప్పట్లో జనసైనికులు భావించారు. ప్రత్యేక కారణాల రీత్యా పవన్‌, అప్పట్లో రావెల కిషోర్‌ విషయమై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అదిప్పుడు ఖరీదైన తప్పిదంగా మారింది. రావెల ఒక్కరే కాదు, ఇలాంటోళ్ళు ఇంకా పార్టీలో చాలామందే వున్నారన్నది జనసైనికుల అభిప్రాయం. అలాగని, పార్టీని వున్నపళంగా ప్రక్షాళన చేసేస్తే, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చేటప్పుడే, వారి విషయంలో ఒకటికి పదిసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవాల్సి వుంటుంది.

ఎన్నికల ముందర చేరికలు, జంపింగులు, ఎన్నికల తర్వాత ఇలాంటి వెన్నుపోట్లు సర్వసాధారణమే. అయినాగానీ, జనసేన లాంటి పార్టీలకు ఇలాంటి వ్యవహారాలు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ‘గడచిన ఐదేళ్ళూ నీతివంతమైన రాజకీయాలు చేశాం.. ఇకపైనా చేస్తాం.. డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలు చేయం.. ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నాం.. జనం కోసం కష్టపడేవారు వుండొచ్చు, వేరే రాజకీయ లక్ష్యాలతో వున్నోళ్ళు వెళ్ళిపోవచ్చు..’ అని సమీక్షల్లో నిర్మొహమాటంగా జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలతోనే ఈ పరిస్థితి వస్తోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే, రాజకీయ అవసరాలతో పార్టీలోకొచ్చినవారు, కోవర్టులుగా కొందరు.. తమ అవసరాలు నెరవేరవని భావించి, వచ్చిన పనైపోయిందనుకుని.. పార్టీని వదిలి వెళుతున్నారని జనసేన నేతలు అంటున్నారు. జనసేనకు రాజీనామా చేసిన వెంటనే, రావెల కిషోర్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో సమావేశమవడం గమనార్హం.

Related Posts

జనసైనికుడొక్కడే.. వైఎస్‌ జగన్‌ని తట్టుకోగలడా.!

‘కవాతు’ వేగం పెంచుతున్న జనసైన్యం

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...