‘రంగస్థలం’ సినిమాకి ఆశించిన స్థాయిలో జాతీయ పురస్కారాలు దక్కకపోవడంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. ఆ సంగతి పక్కన పెడితే, ‘రంగస్థలం’ సినిమాకి అవార్డులు పోటెత్తుతూనే వున్నాయి. ఇటీవలే సాక్షి ఎక్స్‌లెన్స్ పురస్కారాల వేడుకలో ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాకిగాను అందుకున్న విషయం విదితమే.
తాజాగా సైమా అవార్డ్స్ వేడుకలో ‘రంగస్థలం’ పేరు పలుమార్లు మార్మోగిపోయింది. ఉత్తమ నటుడి కేటగిరీలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాకిగాను సైమా పురస్కారాన్ని గెల్చుకున్నాడు. రామ్‌చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడి తరఫున ఈ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. మరోపక్క, ఉత్తమ దర్శకుడు (సుకుమార్), ఉత్తమ సహాయ నటి (అనసూయ భరద్వాజ్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్ – ఎంత సక్కగున్నావే), ఉత్తమ గాయని (ఎం.ఎం.మానసి – రంగమ్మా మంగమ్మా), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (రత్నవేలు), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ (మౌనిక రామకృష్ణ) ఇలా పలు కేటగిరీల్లో సైమా పురస్కారాలు ‘రంగస్థలం’ సినిమాని వరించాయి.
పాపులర్ సెలబ్రిటీ ఇన్ సోషల్ మీడియా పురస్కారం రౌడీ హీరో విజయ్ దేవరకొండకు దక్కింది. ఇటీవలి కాలంలో యువత నోళ్ళలో ఎక్కువగా విన్పిస్తోన్న ‘పిల్లా రా’ (ఆర్ఎక్స్ 100) సాంగ్‌కి సైతం ‘సైమా’ పురస్కారం దక్కడం గమనార్హం. మహానటి సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్‌కి, సైమా పురస్కారం కూడా లభించింది.
149098 914114Spot on with this write-up, I must say i believe this excellent internet site needs much far more consideration. Ill probably be once once more to learn a terrific deal a lot more, numerous thanks that data. 706962
5693 290177Hey, you used to write fantastic, but the last couple of posts have been kinda boring I miss your tremendous writings. Past few posts are just a bit out of track! come on! 28262
400938 7833This web page is often a walk-through for all of the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 906713
256887 847700Quite intriguing subject , appreciate it for putting up. 344934