Switch to English

ఈనాడు కిందకి.. సాక్షి కాస్త పైకి..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు మీడియా పరిస్థితి ఏమీ బాగోలేదని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దానిని బలపరిచే గణాంకాలు బయటకి వచ్చాయి. అనేక కారణాలతో తెలుగు మీడియా.. ముఖ్యంగా ప్రింట్ మీడియా తిరోగమనంలో పయనిస్తోంది. పాఠకుల సంఖ్య తగ్గడంతో యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతుండగా.. న్యూస్ ప్రింట్ కాస్ట్ పెరగడంతో నిర్వహణ వ్యయం భారమవుతోంది. వెరసి తెలుగు పత్రికలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా 2019 రెండో క్వార్టర్లో పత్రికల స్థితిగతులు ఎలా ఉన్నాయో వివరిస్తూ ఇండియన్ రీడర్ షిప్ సర్వే (ఐఆర్ఎస్) గణాంకాలు విడుదలయ్యాయి.

మొత్తమ్మీద చూస్తే పత్రికల కంటే డిజిట్ మీడియా వైపు జనం ఆకర్షితులవుతున్నారే విషయం స్పష్టమవుతోంది. ఆన్ లైన్ లో వార్తాపత్రిక చదివేవారి సంఖ్య 2017లో 4.4 శాతం మంది ఉండగా.. 2019 రెండో త్రైమాసికంలో 6.1 శాతానికి పెరిగింది. ఇక ఆన్ లైన్ లో వార్తలు చదివి తెలుసుకునేవారి సంఖ్య 2017లో 4.8 శాతం మంది ఉండగా.. 2019 రెండ త్రైమాసికంలో 9.3 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద వార్తాపత్రికల ద్వారా కాకుండా ఆన్ లైన్లో (డిజిటల్ మీడియా, వెబ్ మీడియా, యాప్ బేస్డ్) వార్తలు చదివేవారు 2017లో 7.3 శాతం మంది ఉండగా.. ప్రస్తుతం 13.4 శాతానికి పెరిగింది.

మొత్తమ్మీద ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య 9 శాతం నుంచి 15 శాతానికి పెరగడం విశేషం. ఇక తెలుగు పత్రికల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అగ్రపథంలో కొనసాగుతున్న ఈనాడు తన స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, పాఠకుల సంఖ్యను మాత్రం దారుణంగా కోల్పోయింది. ప్రాంతీయ పత్రికల్లో దైనిక్ జాగరణ్ తొలి స్థానంలో ఉండగా.. ఈనాడు పదో స్థానంలో ఉంది. 2017లో ఈనాడు టోటల్ రీడర్ షిప్ (టీఆర్) 1.58 కోట్లు ఉండగా.. ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికంలో 1.43 కోట్లకు పడిపోయింది. ఇక ఈనాడు ఏవరేజ్ ఇష్యూ రీడర్ షిప్ (ఏఐఆర్) 2017లో 70.16 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 59.73 లక్షలకు పడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈనాడు పాఠకుల సంఖ్య తగ్గింది.

అయితే, తెలుగు పత్రికల్లో రెండో స్థానంలో ఉన్న సాక్షి పాఠకుల సంఖ్య కాస్త పెరగడం విశేషం. సాక్షి టోటల్ రీడర్ షిప్ 2017లో 91.75 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 86.22 లక్షలకు, రెండో త్రైమాసికంలో 85.98 లక్షలకు తగ్గింది. అయితే, ఈ తగ్గుదల తెలంగాణలో మాత్రమే నమోదు కాగా, ఏపీలో మాత్రం పెరుగుదల కనిపించింది.

2017లో ఏపీలో సాక్షి టోటల్ రీడర్ షిప్ 56.91 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 52.38 లక్షలకు తగ్గింది. రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మాత్రం 53.70 లక్షలకు చేరి స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. ఇక రెండు రాష్ట్రాల్లో కలిపి సాక్షి ఏవరేజ్ ఇష్యూ రీడర్ షిప్ విషయానికి వచ్చేసరికి 2017లో 32.99 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 29.47 లక్షలకు తగ్గి.. రెండో త్రైమాసికంలో 30.86 లక్షలకు పెరిగింది. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల పాఠకుల్లో కూడా భారీ తరుగుదల నమోదైంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...