Rangabali Review: నాగ శౌర్యకు హిట్ వచ్చి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో రంగబలి అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. విభిన్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
జులాయిగా తిరిగే శౌర్య (నాగ శౌర్య) రాజవరం అనే ఊర్లో ఉంటాడు. అయితే వైజాగ్ కు చెందిన డాక్టర్ (సహజ) ను చూసి ప్రేమలో పడతాడు శౌర్య. సహజంగానే హీరోయిన్ తండ్రికి ఈ ప్రేమ నచ్చదు. ఆయన (మురళి శర్మ), శౌర్యకు ఎలాంటి కండిషన్ పెట్టాడు. శౌర్య జీవితం రాజవరంలోని రంగబలి సెంటర్ తో ఎలా ముడిపడి ఉంది అన్నది చిత్ర ప్రధాన కథాంశం.
నటీనటులు:
నాగ శౌర్య చూడటానికి బాగున్నాడు. జులాయి కుర్రాడి పాత్రలో శౌర్య నటన బాగుంది. మొత్తంగా రంగబలి కోసం తాను చేయాల్సింది సిన్సియర్ గా చేసాడు.
యుక్తి టిపికల్ హీరోయిన్ పాత్రలో నటించింది. చూడటానికి ఆమె ఓకే. ఇక హీరో ఫ్రెండ్ గా సత్య నటన చిత్రానికే ప్రధాన హైలైట్ గా నిలిచింది. అసలు పెద్దగా కథ అంటూ లేని ఫస్ట్ హాఫ్ ను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలిగాడు అంటే దానికి కారణం సత్య అనడంలో ఎలాంటి సందేహం లేదు.
షైన్ టామ్, గోపరాజు, శరత్ కుమార్ తమ పాత్రలను చక్కగా చేసారు. శుభలేఖ సుధాకర్, నోయెల్, మురళి శర్మలు తమ పరిధుల మేరకు నటించారు. మిగతా వారంతా మాములే. బ్రహ్మాజీ, సప్తగిరి, భద్రం పాత్రల వల్ల పెద్దగా ఒరిగిందంటూ ఏం లేదు.
సాంకేతిక నిపుణులు:
కొత్త దర్శకుడు పవన్ ఎంచుకున్న కథ చాలా పల్చనైనది అయినా కానీ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం ఒక దశ వరకూ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కథ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకుండా చూసుకున్నాడు. అయితే అసలు కథ చెప్పాల్సిన సెకండ్ హాఫ్ లో పూర్తిగా తడబడ్డాడు మన నూతన దర్శకుడు. ఇక క్లైమాక్స్ మొత్తం తేలిపోవడంతో ప్రామిసింగ్ గా మొదలైన రంగబలి బిలో యావరేజ్ ఫీల్ తో ముగుస్తుంది.
కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కన్సిస్టెంట్ గా లేదు. దివాకర్, వంశీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సిహెచ్ మ్యూజిక్ చిత్రానికున్న నెగటివ్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ప్రకాష్ ఆర్ట్ వర్క్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్:
- సత్య ఫస్ట్ హాఫ్ కామెడీ
- నాగ శౌర్య
మైనస్ పాయింట్స్:
- వీక్ సెకండ్ హాఫ్, క్లైమాక్స్
- సంగీతం/పాటలు
విశ్లేషణ:
మొత్తంగా చూసుకుంటే రంగబలి ఒక బిలో యావరేజ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ లో సత్య కామెడీ బాగానే అనిపించినా సెకండ్ హాఫ్ పై దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి, మంచి పాటలు చేయించుకుని ఉంటే ఈ చిత్ర రిజల్ట్ వేరే విధంగా ఉండేది.
తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.25/5