Rama Banam Review: గోపీచంద్ – శ్రీవాస్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరూ చేసిన లక్ష్యం, లౌక్యం భారీ హిట్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేసిన రామబాణం కూడా ఆసక్తి రేకెత్తించింది. ఈ క్రమంలో ఈరోజే విడుదలైన రామబాణం ఎలా ఉందో చూద్దామా.
కథ:
చిన్నప్పటి నుండి వయోలెంట్ గా ఉండే తన తమ్ముడు విక్కీని ఇంట్లో నుండి వెళ్లగొట్టేస్తాడు తన అన్న. అయితే కోల్కతా వెళ్ళిపోయిన విక్కీ ఒక పెద్ద డాన్ గా అవతారం ఎత్తుతాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి కోసం విక్కీ తిరిగి తన కుటుంబానికి దగ్గర కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన కుటుంబం భారీ సమస్యల్లో ఉన్నట్లు గుర్తిస్తాడు.
ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? గొడవలంటే ఇష్టం లేని అన్నకు డాన్ గా మారిన తమ్ముడు ఆ సమస్యలను దూరం చేశాడా? తర్వాత పరిణామాలేంటి?
నటీనటులు:
గోపీచంద్ చూడటానికి బాగున్నాడు. తన స్టైలింగ్ కూడా బాగానే కుదిరింది. అయితే తన కటౌట్ కు తగ్గ చిత్రాలు పడట్లేదని అనిపిస్తుంది రామబాణం చూస్తుంటే. ఈ చిత్రంలో విక్కీగా గోపీచంద్ కొత్తగా చేసిందంటూ ఏం లేదు. తన పాత పాత్రల తరహాలోనే ఈ చిత్రం కూడా సాగుతుంది.
డింపుల్ హయతి పర్వాలేదు. ఇక్కడ ప్రధానంగా ఆమె చేయడానికంటూ ఏం లేకుండా పోయింది. నామమాత్రమైన పాత్ర చేసింది ఇందులో. గోపీచంద్ అన్నగా జగపతి బాబు సరిగ్గా సరిపోయాడు. ఖుష్బూ కూడా బాగానే చేసింది. మిగతా వాళ్ళు డీసెంట్ సపోర్టింగ్ రోల్స్ చేసారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు శ్రీవాస్ సినిమా రిలీజ్ కు ముందు ఇచ్చిన బిల్డప్ కు సినిమాకు పెద్దగా సంబంధం లేదు. కుటుంబ విలువలు, కంప్లీట్ ఎంటర్టైనర్ అంటూ రామబాణం గురించి చెప్పుకొచ్చాడు కానీ రామబాణం ఒక ఫార్ములా ప్రకారం నడిచే చిత్రం. మనం ఇప్పటికే ఈ ఫార్ములాలో కొన్ని పదుల సంఖ్యలో చిత్రాలు చూసేసాం. ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రధానమైన ప్లస్ కావాల్సిన అన్న-తమ్ముడు సెంటిమెంట్ థ్రెడ్ వర్కౌట్ కాలేదు. దీంతో రామబాణం ఒక ఫార్ములా రొటీన్ ఎంటర్టైనర్ అనిపించుకుంది.
మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా అంతే. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చన్న ఫీల్ కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ, స్క్రీన్ ప్లే
- బోరింగ్ టెంప్లేట్
విశ్లేషణ:
రామబాణంకు డీసెంట్ సెటప్ కుదిరింది. కొత్తగా లేకపోయినా కనీసం ఎంటర్టైనింగ్ గా ఉండి ఉంటే నడిచిపోయేది. మొత్తంగా బిలో యావరేజ్ చిత్రంగా ముగుస్తుంది రామబాణం.
తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.25/5
There is definately a lot to find out about this issue.
I like all of the points you made.