Switch to English

Anirudh Ravichander: అనిరుద్ లిస్ట్ లో టాప్ హీరోలతో అదిరిపోయే లైనప్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Anirudh Ravichander: ‘వై దిస్ కొలవెరి’ అంటూ తొలి పాటతోనే యావత్ సినీ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్( Anirudh Ravichander). దీంతో తమిళ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ( AR Muragadoss)- విజయ్( Vijay)కాంబినేషన్ లో వచ్చిన ‘కత్తి’ సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో ‘సెల్ఫీ పిల్ల’ పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అనిరుద్ కు అవకాశాలు క్యూ కట్టాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో తమిళ ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తున్నాడు. టాలీవుడ్ లోను అడుగుపెట్టి ఇక్కడ అజ్ఞాతవాసి, యూటర్న్, నానిస్ గ్యాంగ్ లీడర్ అంటే సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1) జవాన్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan)- అట్లీ( Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న జవాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార( Nayanatara) హీరోయిన్. విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2) జైలర్

నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్( Rajnikanth) నటిస్తున్న చిత్రం జైలర్. తమన్నా ( Tamannaa), కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ( Ramyakrishna)కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు.

3) లియో

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లియో’. త్రిష( Trisha) హీరోయిన్. అర్జున్ సర్జ, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. దీనికి కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్.

4) NTR 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR)- సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva)కాంబినేషన్లో వస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి అనిరుద్ స్వరాలు అందిస్తున్నాడు. బాలీవుడ్ నటి జాన్వి కపూర్( Jahnvi Kapoor)హీరోయిన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

5) ఇండియన్ 2

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. కమల్ హాసన్ హీరో( KamalHassan). కాజల్ అగర్వాల్( Kajal Agarwal), రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

6) ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. శ్రీ లీల ఇందులో హీరోయిన్. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్.

7) లైకా ప్రొడక్షన్స్ తమిళ హీరో అజిత్ కుమార్( Ajit Kumar) తో ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది. ఈ సినిమాకు ‘విదా ముయ్యార్చి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిపింది. అనిరుద్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలిపింది. మజిల్ తిరుమణి దర్శకత్వం వహిస్తారు.

8) తలైవార్ 170

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajnikanth)- టీజే జ్ఞానవేల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘తలైవార్ 170’ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలా చేతినిండా సినిమాలతో అనిరుద్ మరో రెండేళ్ల పాటు బిజీ కానున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...