Switch to English

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా ఉంది. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.

ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు మాడ్లాడుతూ.. “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనేది అందరికీ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో దర్శకుడిగా సత్యరాజ్ మొదటి సినిమా చేశాడు. సినిమాలో కమర్షియల్ అంశాలు దండిగా ఉన్నాయి. సత్యరాజ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ముత్యాల రామదాసు గారు ఛాంబర్ లోనూ, కౌన్సిల్ లోనూ అనేక పదవుల్లో సేవలు అందించారు. చిన్న సినిమాలకు, నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటుంటారు. ముత్యాల రామదాసు నేతృత్వంలో రూపొందిన ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను. సాలూరి రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి మంచి సంగీతం అందించాడు. అందుకే ఆదిత్య సంస్థ పాటలను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. హీరో రవితేజ నున్నా ట్రైలర్ లో బాగా చేశాడు. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నేహ కూడా ఎటువంటి బెరుకు లేకుండా చాలా బాగా చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత ముత్యాల రామదాసు గారు మాట్లాడుతూ.. “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి అనే టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలిగేలా చేశారు. దర్శకుడు సత్యరాజ్ కి మంచి విజన్ ఉంది. సంగీత దర్శకుడిగా రోషన్ సాలూరిని తీసుకొని తనకున్న పరిమిత వనరులతోనే అద్భుతమైన సంగీతాన్ని రాబట్టుకోగలిగాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. దర్శకుడు తాను ఏం చేయాలో ఈ సినిమా కోసం అంతా చేశాడు. ఒక ప్రొడ్యూసర్ గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ గా మేము ఆలోచించేది ఏంటంటే ఇది కమర్షియలా కాదా. ఎందుకంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అంశాలు సినిమాలో ఉండాలి. మంచి మ్యూజిక్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించడం చూస్తున్నాం. రాజుగారి అమ్మాయి నాయుడుగారి చిత్రంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సమస్యలు ఎదుర్కొని దర్శకుడు ఈ సినిమాని పూర్తి చేయడం గొప్ప విషయం. అతను భవిష్యత్ లో పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ఇక చిత్ర హీరో రవితేజకి బయట కాస్త సిగ్గు ఎక్కువ. కానీ స్క్రీన్ మీద చూసేటప్పుడు రజినీకాంత్ లా కనిపిస్తాడు. ఎంతో ప్రతిభ ఉన్న రవితేజ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎక్కడా రాజీపడకుండా తీసిన సినిమా ఇది. ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన రవితేజ తల్లి గారు కుమారి, రామిశెట్టి వెంకట సుబ్బారావు గారు, కలవకొలను సతీష్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 9న విడుదలవుతున్న ఈ సినిమాకి మీడియా సహకారం ఉంటుందని, ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాను.” అన్నారు.

కథానాయకుడు రవితేజ నున్నా మాట్లాడుతూ.. “నిర్మాత ముత్యాల రామదాసు గారు మా వెనకుండి ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేయించి, ఇక్కడివరకు తీసుకొచ్చారు. రామదాసు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మా దర్శకుడు, నేను ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. ఎంతో ఇష్టంతో ఈ సినిమా కోసం కష్టపడ్డాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉండే కమర్షియల్ సబ్జెక్టు ఇది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. హీరోయిన్ నేహ జురెల్ చాలా బాగా చేసింది. జబర్దస్త్ బాబీ, జబర్దస్త్ అశోక్ మాకు ఎంతగానో సహకరించారు. అలాగే మా అమ్మ నున్నా కుమారి గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. థాంక్యూ అమ్మ. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

దర్శకుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. “ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం ముత్యాల రామదాసు గారు. మా సినిమాని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. చిన్న సినిమాని బతికించాలంటే అది మీడియా వల్లే సాధ్యమవుతుంది. అందుకే మీడియానే ముఖ్యఅతిథులుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా సినిమా పూర్తయ్యి, విడుదలకు సిద్ధమైందంటే రామదాసు గారే కారణం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరశంకర్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. హీరో రవితేజ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు అన్నింట్లో ఇన్వాల్వ్ అవుతూ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. సంగీత దర్శకుడు రోషన్, డీఓపీ మురళి కూడా ఎంతో సహకరించారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు” అన్నారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు నిర్మాతలు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం మార్చి 9వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

సినిమా

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

రాజకీయం

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి పిలుపు

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)గా పిలిచే...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...

మీ లాంటి నాయకుడు దొరకడం తెలుగువారి అదృష్టం.. చంద్రబాబుకు చిరంజీవి విషెస్..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. 'కృషి, పట్టుదల, అంకిత భావం...

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే మా బాధ తెలిసేది : జాన్వీకపూర్

జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం అమ్మడు మంచి...

నాలుగు వారాల పాటు ప్రభాస్ టూర్.. ఆ విలేజ్ కి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సలార్-2, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో...