యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కొంత కాలం క్రితం విడుదలైన గరుడవేగ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెల్సిందే. కల్కి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అదరగొట్టాడు. ఇక ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.
మే 20న శేఖర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం విశేషం. అలాగే రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ లు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం. మరి ఈ చిత్రంతో రాజశేఖర్ తిరిగి ఫామ్ అందుకుంటాడేమో చూడాలి.
671516 599603You are the very best, Its posts like this that maintain me coming back and checking this internet site regularly, thanks for the information! 315716