Switch to English

ఎక్సక్లూసివ్: రాజన్న రాజ్యం “సాక్షి”కి రానట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జగన్ ఒక్కసారి సీఎం అయితే చాలు.. తమ బతుకులు మారిపోతాయని వారంతా భావించారు. ఆయన్ను సీఎం చేయడానికి తమ వంతు కృషి చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మించి పని చేశారు. పదేళ్లకు జగన్ కల నెరవేరింది. ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వెళ్తున్నారు. ఇక తమకూ రాజన్నరాజ్యం వచ్చినట్టే అని వారు కూడా అనుకున్నారు. తమ బతుకుల్లో కొత్త కాంతులు ఖాయమని ఆనందపడ్డారు. కానీ వారి ఆశలు ఒక్కసారిగా నీరుకారిపోయాయి. వారి జీవితాలు బోరుమన్నాయి. ఇంతకీ వారెవరో కాదు.. సాక్షి ఉద్యోగులు.

జగన్ ముఖ్యమంత్రి అయితే తమ జీవితాల్లో పెనుమార్పులు ఖాయమని ఆశించిన అభాగ్యులు. మీ బాస్ సీఎం అయ్యారుగా.. బోనస్ ఎంత ఇచ్చారు? హైక్ ఎంత పడింది అంటూ సాక్షికి చెందిన ఓ జర్నలిస్టును కదిపేసరికి ఒక్కసారిగా గొల్లుమన్నాడు. బయట తమకు రెండు నెలల బోనస్ ఇచ్చేశారని, ఏకంగా రూ.10వేల జీతం పెంచేశారని ప్రచారం జరుగుతోందని, కానీ వాస్తవంగా అలాంటిదేమీ లేదని, తమ బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని బావురుమన్నాడు.

అసలు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, తమకు జీతాలు పెంచి ఎన్నాళ్లయిందో జగన్ కు తెలుసో లేదో కూడా తమకు తెలియదని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు సాక్షి జర్నలిస్టు ఆవేదనకు అక్షరరూపం అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఇందులో నిజానిజాలు ఎంత తెలుసుకునే ప్రయత్నం చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ప్రస్తుతం సాక్షి ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్న విషయం వెల్లడైంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలల్లో సాక్షి సిబ్బందికి ఇంక్రిమెంట్ పడుతుంది. అయితే, గత కొన్నేళ్లుగా రెండు సంవత్సరాలకు ఓసారి మాత్రమే సిబ్బంది జీతాలు పెరిగాయి. అది కూడా చాలా స్పల్ప మొత్తమే. 2017లో వారికి ఇంక్రిమెంట్ పడగా.. మళ్లీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. గతేడాది ఎంతో ఆశతో ఎదురుచూసిన సాక్షి సిబ్బందికి నిరాశే ఎదురైంది. అయితే, మళ్లీ ఏడాది.. అంటే 2019లో ఘనంగా జీతాలు పెంచుతారనే టాక్ నడిచింది.

ఈ క్రమంలో వీ6 ఛానల్ నుంచి వెలుగు పత్రిక రావడంతో పలువురు జర్నలిస్టులు అధిక వేతనాల కోసం అందులో చేరిపోయారు. మరికొందరు మాత్రం తమ హెచ్ఓడీల సూచన మేరకు భారీగా జీతం పెరుగుతుందనే భరోసాతో ఇక్కడే ఉండిపోయారు. అలాంటివారంతా ఇప్పుడు చాలా బాధపడుతున్నారని సమాచారం.  పై స్థాయిలో ఉన్న పది, పదిహేను మంది జీతాలకే కొన్ని రూ.కోట్లు వెచ్చిస్తున్నారని.. తమ వంటి చిన్నస్థాయి ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడంలేదని విలపిస్తున్నారు.

తెలుగురాని వ్యక్తికి సీఈఓ పోస్టు..

సాక్షిలో మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. ఈ సంస్థ కొత్త సీఈఓగా ఓ ఉత్తరాది వ్యక్తిని నియమించడం. ఆయనకు తెలుగు రాదు. ఏడాదికి రూ.2 కోట్ల భారీ ప్యాకేజీతో ఆయన నియామకం జరిగిందని సమాచారం. కేవలం మార్కెటింగ్ విభాగంలో మాత్రమే పట్టున్న ఆయనకు మొత్తం సంస్థ బాధ్యతలు అప్పగించడం.. జర్నలిజం గురించి ఏమాత్రం తెలియన సదరు సీఈఓ.. అన్నీ తానై వ్యవహరించడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు సంస్థలోని చాలామందికి నచ్చడంలేదని తెలుస్తోంది. పైగా ఆయనకు సహాయకులుగా ఉన్న మరో ఇద్దరికి నెలకు రూ.2 లక్షల వేతనం అని తెలిసింది. వీరిద్దరూ కాకుండా ఆయనకు సంస్థలో జరిగే సంగతులు చెప్పడానికి, ఇతరత్రా పనులు చేయడానికి మరో ఇద్దరు సిబ్బంది పనిచేస్తుంటారు.

ఇక సాక్షి డైరెక్టర్లు ఒక్కొక్కరికీ రూ.లక్షల్లోనే వేతనాలున్నాయి. వీరు కాకుండా వివిధ విభాగాల హెచ్ఓడీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు వంటి పై స్థాయిలో ఉండే వ్యక్తుల వేతనాలు సైతం భారీగానే ఉంటాయి. ఎటొచ్చీ కింది స్థాయి సిబ్బంది పరిస్థితే దారుణంగా ఉందని తెలుస్తోంది.

సర్క్యులేషన్ పరంగా ఈనాడు మొదటి స్థానంలో ఉండగా.. సాక్షి రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పత్రికలున్నాయి. ఈనాడులో జూనియర్ జర్నలిస్టు వేతనం రూ.25 వేలు కాగా, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణల్లో దాదాపు రూ.23 వేలు ఉంది. అదే సాక్షి విషయానికి వచ్చేసరికి అది రూ.15 వేలు మాత్రమే. సాక్షి ప్రారంభం నుంచి ఉన్న సిబ్బంది వేతనాలు సైతం రూ.20 వేల లోపే ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ పాటికే సాక్షి సిబ్బందికి ఇంక్రిమెంట్లు పడాల్సి ఉండగా.. సీఈఓతోపాటు ఒక డైరెక్టర్ ఆపినట్టు సమాచారం. ఈసారికి 6.5 శాతం హైక్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ వేతన బడ్జెట్లో అధిక మొత్తం వీరికే సరిపోతున్నందున కింది స్థాయి సిబ్బందిని తగ్గించడం, వారి వేతనాలు పెంచకుండా కుదించడం వంటి చర్యలతో సంస్థకు మిగులు చూపాలని వారు భావిస్తున్నారని అంటున్నారు. ఈ

విషయాలన్నీ అటు సీఎం జగన్ కు, ఇటు చైర్ పర్సన్ కు తెలియనీయకుండా మంత్రాంగం నడుస్తోందనే అనుమానం సాక్షి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమ ఆవేదన సీఎం జగన్ కు చేరితే, ఆయన తమ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అప్పుడే తమకూ రాజన్నరాజ్యం వస్తుందని నమ్ముతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...