Switch to English

అల్లు అర్జున్‌ సినిమాలో అక్కినేని హీరోకేంటి పని.? 

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సరికొత్త కాంబినేషన్లు టాలీవుడ్‌లో సెట్‌ అవుతున్నాయి. నిజంగానే వాటిల్లో కొన్ని అనూహ్యమైన కాంబినేషన్స్‌ వుంటున్నాయి. కొన్నిసార్లు అవి బాగానే వర్కవుట్‌ అవుతుండడం గమనార్హమిక్కడ. మహేష్‌ హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్‌ సర్‌ప్రైజ్‌ రోల్‌ చేశాడు. ఆ సినిమా అల్లరి నరేష్‌కి మంచి మైలేజ్‌ ఇచ్చింది. ఇక, తాజాగా అలాంటిదే ఇంకో కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. ఈసారి అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సుశాంత్‌ సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ కానున్నాడు. అంటే, మెగా కాంపౌండ్‌కి చెందిన హీరో సినిమాలో అక్కినేని కాంపౌండ్‌కి చెందిన హీరో నటించబోతున్నాడన్నమాట.

గతంలో చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు ఓ సినిమాలో కలిసి నటించారు.. మామా అల్లుళ్ళగా. అదే, ‘మెకానిక్‌ అల్లుడు’. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించారు. లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందిన ‘స్టైల్‌’ సినిమా అది. ఏదో, సర్‌ప్రైజ్‌ కాంబినేషన్‌ అని కాకుండా, ఈ మధ్య సమ్‌థింగ్‌ స్పెషల్‌.. అంటూ కాంబినేషన్స్‌ సెట్‌ అవుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే. లేకపోతే, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కలిసి ఓ సినిమా చేస్తారని ఎవరైనా ఊహించారా?

ఇదిలా వుంటే, అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాలో తనకు ఛాన్స్‌ రావడం పట్ల సుశాంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, సినిమాలో తన పాత్రకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నాడు సుశాంత్‌. తనకు బాగా ఇష్టమైన దర్శకుడు, ‘ఆర్య’ సినిమా నుంచి తాను ఎంతో ఇష్టపడుతున్న హీరో, తన స్నేహితురాలు పూజ.. ఇలా ప్రతి ఒక్కరూ తనకు ఎంతో ఇష్టమైనవారితో కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా వుందని సుశాంత్‌, సోషల్‌ మీడియా వేదికగా తాను చేస్తున్న కొత్త ప్రాజెక్ట్‌ గురించి వివరించాడు.

కెరీర్‌లో ఫ్లాపుల మీద ఫ్లాపులు చూసిన తర్వాత, ‘చిలసౌ’ సినిమాతో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న సుశాంత్‌, ఓ భారీ ప్రాజెక్ట్‌ ద్వారా సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధమవుతుండడం విశేషమే మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...