రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ దశ నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సరిగా అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ చేసే స్థాయి వరకూ వెళ్ళింది. చాలా కాలం నిర్మాణంలోనే ఉన్న ఈ చిత్రం మొత్తానికి జనవరి 14న విడుదలవుతున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా సాంగ్స్ ను విడుదల చేయట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ రీసెంట్ గా నెగటివ్ ట్రెండ్ స్టార్ట్ చేయగా మొత్తానికి ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. మొదటి సింగిల్ ఈ రాతలే ను జనవరి 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
జస్టిన్ ప్రభాకరన్ సౌత్ వెర్షన్ కు సంగీతం అందించాడు. ఈ సంగీత దర్శకుడు డియర్ కామ్రేడ్ లో వినసొంపైన మెలోడీతో ఆకట్టుకోవడంతో రొమాంటిక్ డ్రామా అయిన రాధే శ్యామ్ కు ఎలాంటి సంగీతం అందించాడా అన్న ఆసక్తి అందరిలో ఉంది.