తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 కోసం సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే హౌస్ కి సంబందించిన సెట్టింగులు కూడా పూర్తీ కావొచ్చాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ ఊపందుకుంది. అయితే ఈ రెండో సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పాటు పలు వివాదాలు చుట్టుముట్టాయి. రెండో సీజన్ విషయంలో జరిగిన లోటుపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ మూడో షో తో మళ్ళీ బిగ్ బాస్ ఉనికి చాటాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం హోస్ట్ ఎవరన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా టాలీవుడ్ జేజమ్మ అనుష్క హోస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోకి పురుషులు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించారు. అందుకే ఈ సారి హీరోయిన్ తో ఎందుకు చేయించకూడదు అన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 3లో ఎవరు పాల్గొంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ ని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.
ఈ మూడో సీజన్ లో ఎక్కువగా జబర్దస్త్ బ్యాచ్ ని దింపే ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో ముఖ్యంగా యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రవి లతో పాటు పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సీజన్ కోసం ఏకంగా వంద రోజులు కేటాయించే విషయంలో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. వీరితో పాటు మరోసారి ముగ్గురు ప్రేక్షకులకు ఛాన్స్ ఇస్తున్నట్టు టాక్. సో జూన్ లో మొదలయ్యే ఈ షో కోసం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.
