పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించి.. అరెస్టు చేయించారు. ఆప్ ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లోనే ఓ మంత్రిపై వేటు వేయడం సంచలనం రేపుతోంది. ఆరోగ్య శాఖకు సంబంధించి పరికరాల కొనుగోళ్లు, టెండర్లు విషయంలో మంత్రి సింగ్లా ఒకశాతం కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇవి సీఎంకు చేరడంతో విచారణ జరిపారు. వాస్తవమని తేలడంతో చర్యలు తీసుకున్నారు.
దీనిపై సీఎం మాట్లాడుతూ.. ‘సింగ్లా కమిషన్ డిమాండ్ చేయడంపై నాకు ఫిర్యాదు అందింది. మీడియా, ప్రతిపక్షాలకు ఈ విషయం తెలియదు. విచారణ చేయించగా వాస్తవమని తేలింది. సింగ్లా తప్పు అంగీకరించారు. ప్రభుత్వంలో ఒక్క శాతం అవినీతికి కూడా తావు లేదు. దేశానికి కేజ్రీవాల్ లాంటి కుమారుడు, భగవంత్ మాన్ వంటి సైనికుడు ఉన్నంతవరకూ అవినీతిపై యుద్ధం జరుగుతూనే ఉంటుంది’ అని అన్నారు. ఆప్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరగడం రెండోసారి. 2015లో కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై తన మంత్రివర్గంలోని మంత్రిని తొలగించారు.
755056 517790Spot on with this write-up, I really suppose this web site needs rather more consideration. most likely be once far more to learn a lot a lot more, thanks for that info. 744248
810143 483336I think your suggestion would be helpful for me. I will let you know if its work for me too. Thank you for sharing this beautiful articles. thanks a whole lot 977966
246162 589943Oh my goodness! a wonderful post dude. Thanks a great deal Nevertheless I is going to be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everyone acquiring identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 477911
629454 473898I enjoy seeking via and I conceive this site got some truly helpful stuff on it! . 725243