ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించాడు. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎందుకు మారారు అన్నది సలార్ మొదటి భాగంలో చూపిస్తారు. ఇక టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు.
అందులో ప్రభాస్ గురించి ఏదైనా ఒక వరస్ట్ విషయం చెప్పమని అడగ్గా, ప్రిథ్వీరాజ్… ప్రభాస్ ఉండగా డైటింగ్ అనే కాన్సెప్ట్ ఉండదని అన్నాడు. ఒకరోజు నా భార్య, తొమ్మిదేళ్ల పాప వచ్చారు. పాప నాకు ఇది ఇష్టం, అది ఇష్టం అని ఏవో చెప్పింది, చిన్న పిల్ల కదా, మీరు నమ్మరు, ప్రభాస్ వాటిని నా రూమ్ కు పంపించాడు. అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేక మరో రూమ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
అలాగే ప్రభాస్ ముందు నాకు ఇది కావాలి అని చెప్పకూడదు, వెంటనే అది ఉండేలా చూస్తాడు అని అన్నాడు.